
సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల ముందు వరకూ శ్రీనివాస్ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన సచివాలయం జీఏడీలో పనిచేస్తున్నారు.
(చదవండి : టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు)