చంద్రబాబు.. ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా? | Karumuri Venkata Reddy Savals Chandrababu Over IT Notices - Sakshi
Sakshi News home page

ఐటీ నోటీసులపై నీ మౌనం అర్ధాంగీకారం కాదా బాబు?

Published Fri, Sep 8 2023 3:40 PM | Last Updated on Fri, Sep 8 2023 5:53 PM

Karumuri Venkata Reddy Savals Chandrababu Over IT Notices - Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా చంద్రబాబు అంటూ సవాల్‌ విసిరారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి.  ఐటీ నోటీసులపై మౌనం దాల్చడం వెనుక కారణం ఏమిటి చంద్రబాబు అని ప్రశ్నించారు.  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన వెంకటరెడ్డి..  ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం అర్ధాంగీకారమేనని తేల్చిచెప్పారు. ‘తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. లక్షల కోట్లు దోచేసిన బాబు అడ్డంగా దొరికేశాడు. అవినీతిపై ఎవిడెన్స్‌ లేదంటాడు కానీ, తప్పు చేయలేదని చెప్పడు. దర్యాప్తు ఆలస్యం కావ్వొచ్చు. కానీ బాబు జైలుకు పోవటం ఖాయం. తేలు కుట్టిన దొంగల్లా దుష్ట చతుష్టయం’  అని విమర్శించారు వెంకటరెడ్డి. 

వెంకటరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

ఆ దావా వేయగలవా?
అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేసిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. లెక్కలు చూపని రూ. 118 కోట్లపై ఐటీ శాఖ నోటీసు ఇస్తే, చంద్రబాబు దానిపై స్పందించడం లేదు. ఒక వేళ ఐటీ శాఖ తప్పుడు నోటీసులు ఇచ్చిందని భావిస్తే.. ఆ శాఖ మీద పరువు నష్టం దావా వేయగలవా?. కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చి కోర్టులో విచారణ కోరవచ్చు. కానీ చంద్రబాబు ఆ పని చేయడం లేదంటే.. భయంతోనా?.. లేక ఇంకా లోతుగా వెళ్తే.. మరింత అడ్డంగా దొరికిపోతామన్న ఆందోళనా?

బాబు బీద అరుపులు
ఐటీ నోటీసులు తప్పుడుగా ఇస్తే.. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి అబద్ధం చెబితే అందరిపైనా పరువు నష్టం దావా వేయాలి. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్త పెట్టారని యువగంగాళం యాత్ర చేస్తున్న లోకేశ్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఐటీ నోటీసులపై  మాట్లాడడం లేదు. స్పందించడం లేదు. చంద్రబాబు కూడా కోర్టుల్లో కేసులు వేయడం లేదు. కానీ చంద్రబాబుకు అరెస్టు అవుతాననే భయం పట్టుకుంది. కాబట్టే ఇంటికి ఒకరు వచ్చి రక్షణ వలయంగా ఉండాలని.. చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. 

బాబు మౌనం అర్థాంగీకారం
చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో ఐటీ నోటీసుల ద్వారా బట్టబయలైంది. అయినా ఆయన ఇప్పటి వరకు ఐటీ నోటీసులపై స్పందించడం లేదంటే.. మౌనం అర్థాంగీకారం భావించాలి. 

లక్షల కోట్లు ఉండొచ్చు
ఏదైనా అంశం వస్తే.. చంద్రబాబు ఉదయం, మధ్యాహ్నం ప్రెస్‌మీట్లు పెడతారు. వాటిపై ఎల్లో మీడియాలో సాయంత్రం డిబేట్లు నిర్వహిస్తారు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పత్రికల్లో రకరకాలుగా రాస్తారు. ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటిపోయింది. 

షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ. 118 కోట్ల లంచాన్ని షెల్‌ కంపెనీల ద్వారా తీసుకున్నట్లు, ఐటీ నోటీసుల ద్వారా తేటతెల్లమైంది. అయితే వెలుగులోకి రాని ఇలాంటివి చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఉండొచ్చు. కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబు మెక్కిన లంచాలన్నీ బయటకు వస్తే, అది లక్షల కోట్లు ఉంటుంది. 

మింగలేక.. కక్కలేక
తన అవినీతిపై ఏ ఎవిడెన్స్‌ లేదంటాడు తప్ప, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పడు. తన మీద ఎన్నో ఎంక్వైరీలు చేయించినా, ఏమీ పీకలేకపోయారని, తాను నిప్పులాంటి వాడినని చంద్రబాబు చెబుతుంటారు. నిజంగా ఆయన నిప్పు లాంటి వ్యక్తి అయితే.. ఏ ఎంక్వైరీకి అయినా సిద్ధంగా ఉండాలి. వారికి సహకరించాలి. ఇప్పుడు ఐటీ నోటీసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ఏదేదో మాట్లాడుతున్నాడు. తన అవినీతి బండారం అంతా బయటపడడంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. 

తేలు కుట్టిన దొంగల్లా..
ఐటీ నోటీసులపై తేలు కుట్టిన దొంగల్లా పచ్చ బ్యాచ్, దుష్ట చతుష్టయం ఉండిపోయింది. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, దత్తపుత్రుడు, పురంధేశ్వరీతో పాటు, కమ్యూనిస్టులు కూడా ఏం మాట్లాడడం లేదు. అంతా గప్‌చుప్‌గా ఉన్నారు. 

గతంలో కమ్యూనిస్టులు ‘బాబు జమానా అవినీతి ఖజానా’ అని పుస్తకం కూడా వేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏకంగా రూ. 118 కోట్లు లంచంగా తీసుకున్నాడని, ఐటీ శాఖ నోటీసులు ఇస్తే.. కమ్యూనిస్టులు రామకృష్ణ, నారాయణ నోర్లు మూగబోయాయి. వారికి కూడా ఎన్నికల ఫండ్‌ కింద రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు చంద్రబాబు ముట్టజెప్పాడా? అనిపిస్తోంది. ఊ అంటే, ఇంట్లోంచి లాక్కొచ్చి తంతా అంటూ మాట్లాడే దత్తపుత్రుడు కూఆ ఐటీ నోటీసులపై ఎందుకు మాట్లాడటం లేదు?. దానికి కారణం చంద్రబాబు ఇచ్చిన ముడుపులే అని అందరూ అనుకుంటున్నారు.

బీజేపీ నోటికీ తాళాలా!
చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే, తానెందుకు స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటున్నారు. గతంలో ఏలేరు స్కాంపై బీజేపీ వారు ఉదయ కమలం అనే పుస్తకం వేశారు. అలాంటి బీజేపీ ఇప్పుడు నోరు మెదపడం లేదంటే.. ఆ పార్టీ రాష్ట్ర పెద్దలు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు అని ప్రజలకు అర్థమౌతోంది. 

తప్పులు చేయకపోతే..
చంద్రబాబు ఒకవేళ తప్పులు చేయకపోతే కేసులపై కోర్టుల్లో స్టేలు ఎందుకు? వాటిని తొలగింప చేసుకుని, దర్యాప్తును ఎదుర్కోవాలి. చంద్రబాబు నువ్వెన్ని ఎత్తులు, జిత్తులు వేసినా, కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. బోనులో నిలబడకా తప్పదు.

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన కేసులో కూడా స్టే కొనసాగుతోంది. ఏలేరు స్కాంకేసుపైనా కోర్టు స్టే ఉంది. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. పాపం పండినప్పుడు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇన్నాళ్లు వ్యవస్థల్లో వ్యక్తులను అడ్డం పెట్టుకుని అవినీతిని మేనేజ్‌ చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు విచారణ ఎదుర్కోక తప్పదు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
ఈనాడు ఏది రాస్తే అది జనం నమ్మేస్తారనుకునేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నెట్‌ యుగంలో ఎవ్వరూ నమ్మరు. ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెల్సు. 

జగన్‌ వ్యక్తిగత పర్యటన చేశారు. గతంలో అమెరికా, పారిస్‌ వెళ్లారు. ఎక్కడా ప్రభుత్వ ధనాన్ని వినియోగించుకోలేదు. ఫ్లైట్‌ ఖర్చు కూడా జీఓల రూపంలో విడుదల చేస్తారు కదా. అధికారంలో ఉన్నా, లేకపోయినా స్పెషల్‌ ఫ్లైట్స్‌లో తిరుగుతోంది చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు. వాళ్లేమో స్పెషల్‌ ఫ్లైట్స్‌లో తిరగొచ్చు. ప్రతిపక్ష నాయకుడుగా అందరితో పాటు విమానాల్లో జగన్‌ గారు ప్రయాణించారు. లండన్‌ పర్యటనకు తన సొంత ఖర్చుతో సీఎం జగన్‌  వెళ్లారు.

మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే.. ప్రతిపక్ష పార్టీలు సింగిల్‌గా వచ్చి సత్తా చూపించొచ్చు కదా. మా ప్రభుత్వం మీద ప్రజల మద్దతు పెరిగింది. 2019 కంటే ఓటింగ్‌ పెరిగింది. 2014 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాం. 

సీఎం పదవి ముఖ్యం కాకపోతే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆ పదవి ఎందుకు లాక్కున్నారు. సీఎం పదవి కోసమే కదా. సీఎం పదవి కోసమే కదా.. ఎన్టీఆర్‌ మీద నీచమైన కేరికేచర్లు గీయించారు. ఇదే నా ఆఖరి ఎన్నికలని చంద్రబాబు అడుక్కుంటున్నారు. అడుక్కునేవారికి ఓటేయరు. మంచి చేసినవారికి మాత్రమే ఓట్లేస్తారు. చంద్రబాబు ఎన్నిరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసినా టీడీపీకి ఒక్క సీటు వచ్చే అవకాశం లేదు. 2024లో మళ్లీ సీఎం జగన్‌గారే. మా పార్టీ మొత్తం 175 సీట్లు గెల్చుకుంటుంది.

చంద్రన్న తోఫా, అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ అడిగాం. సీబీఐ ఎంక్వైరీ చేస్తే.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు. దర్యాప్తు నాలుగు నెలల్లో ఆలస్యం అవ్వొచ్చు కానీ.. చంద్రబాబు జైలుకు పోవటం ఖాయమని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement