మెదక్: పట్టణంలో బుధవారం మున్సిపల్ శానిటేషన్ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని జరిమాన విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ అధికారి షాదుల్లా మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వాడిన సహించేది లేదని ఆయన హెచ్చరించారు. క్యాన్సర్‌కు కారణమవుతున్న ప్లాస్టిక్‌ను మెదక్ పట్టణంలో పూర్తిగా నిషేదించడం జరిగిందన్నారు. అక్రమంగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న పలు దుకాణాలపై దాడులు చేసి రూ.20100 జరిమాన విధించడం జరిగిందన్నారు.దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది శేఖర్, కిషన్, శ్యామ్ తదితరులు ఉన్నారు.