బెంగళూరు: నగరంలోని షాపింగ్ మాల్‌ల యజమానులు, స్థిరాస్థి వ్యాపారులపై డిసెంబరు 23 నుంచి 26 వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.169 కోట్ల విలువైన అప్రకటిత ఆదాయాన్ని పట్టుకున్నారు. వ్యాపారులపై అధికారులు 23న దాడులు ప్రారంభించారు. తొలి కేసులో వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపించి రూ.143 కోట్ల ఆదాయానికి పన్ను కట్టలేదు. రెండో కేసులో రూ.26 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. రెండో కేసులో వ్యాపారులు తమ సొంత ఖర్చుల్ని వాణిజ్య వ్యయాలుగా చూపించారు. బంగారం, ఆభరణాలను కూడా కొన్నారు.