తోడుగా మీ వెంట...
ట్రావెల్
కొత్తగా వెళ్లేవారి కంటే తరచూ ప్రయాణాలు చేసేవారికి వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు, చూడాల్సిన ప్రాంతాల పట్ల అవగాహన ఉంటుంది. ఇలాంటి వారిని కలిస్తే తప్పక చెప్పే సూచనలు...హ్యాట్ తప్పక ఉండాలి. అది చలి, వాన, ఎండ.. ఏ కాలమైన సూర్యకాంతి నేరుగా ముఖానికి తగలకుండా కాపాడుతుంది.తలనొప్పి, కడుపునొప్పి, సాధారణ జ్వరం.. వంటి మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట ఉంటే ప్రయాణ అసౌకర్యాన్ని సులభంగా తొలగించుకోవచ్చు.
శుభ్రమైన తాగు నీరు ఎన్నో రకాల వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది. అందుకని వెళ్లే చోటుకు తప్పక వాటర్ బాటిల్‌ను తీసు కెళాలి.చక్రాలు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లడం వల్ల ప్రయాణం మరింత తేలికగా అనిపిస్తుంది. కెమరా చార్జర్ కంటే బ్యాటరీ మేలు. కరెంట్ ఉన్న చోట వెతికి, చార్జర్ పెట్టే టైమ్‌లో ఎన్నో అందమైన దృశ్యాలను ఫొటోలో బంధించే అవకాశాన్ని కోల్పోతాం.ఇస్త్రీ అవసరం లేని దుస్తులనే ఎప్పుడూ ప్రయాణంలో తీసుకెళ్లడం మంచిది. ఇంటి దగ్గర ధరించే దుస్తులే ప్రయాణంలోనూ వాడితే మరీ బోర్‌గా ఉండటమే కాదు, సౌకర్యాన్నీ కోల్పోతారు.జాగింగ్‌కు ఉపయోగించే సౌకర్యవంతమైన షూ ప్రయాణంలో సౌకర్యంగా ఉంటాయి.