టీ.నగర్: భారత జాలర్లపై శ్రీలంక నౌకాదళం శనివారం రాత్రి దాడి జరిపింది. రెండు వేల మంది జాలర్లు రామేశ్వరం నుంచి శనివారం 500కు పైగా పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. కచ్చదీవి సమీపంలో రాత్రివేళ చేపలు పడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి పడవల్లో వచ్చిన శ్రీలంక నౌకాదళం సరిహద్దు దాటి చేపలు పడుతున్నారంటూ రామేశ్వరం జాలర్లపై రాళ్లు, బాటిళ్లు విసిరి అక్కడినుంచి వెళ్లగొట్టింది. దీంతో భీతిచెందిన జాలర్లు తీరానికి చేరుకున్నారు. ఓక్కి తుపాన్ తర్వాత సముద్రంలోకి వెళుతున్న తమపై శ్రీలంక నౌకాదళం వరుసగా దాడులు జరుపుతోందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని జాలర్లు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment