Indian fishermen
-
26 మంది భారత జాలర్లను విడుదలచేసిన పాక్
కరాచీ: దాయాది దేశం పాకిస్తాన్ 26 మంది భారత జాలర్లను ఆదివారం విడుదల చేసింది. ఇప్పటివరకూ కరాచీ మలిర్ జైలులో ఉన్నవీరిని లాహోర్‌కు తీసుకెళ్లనున్నారు. సోమవారం వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో వీరిని అధికారులు అరెస్ట్ చేశారు. పాక్‌కు చెందిన ఈదీ ఫౌండేషన్ భారత జాలర్ల ప్రయాణ ఖర్చులను భరించింది. భారత్, పాక్‌ల మధ్య ప్రాదేశిక జలాలకు సంబంధించి స్పష్టమైన ఏర్పాట్లు లేకపోవడంతో పాటు జాలర్లు వాడే పడవలకు జీపీఎస్ తరహా సౌకర్యం లేకపోవడంతో ఇరుదేశాలకు చెందిన జాలర్లను అధికారులు తరచూ అరెస్ట్ చేస్తున్నారు. భారత్, పాక్‌లో విచారణలో తీవ్ర జాప్యం కారణంగా వీరంతా నెలల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. కాగా, ప్రాదేశిక జలాల విషయంలో భారత్, పాక్‌లు నిబంధనలు సడలించాలని, జాలర్లకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని ఈదీ ఫౌండేషన్ కోరింది. -
భారత జాలర్లపై శ్రీలంక నౌకాదళం దాడి
టీ.నగర్: భారత జాలర్లపై శ్రీలంక నౌకాదళం శనివారం రాత్రి దాడి జరిపింది. రెండు వేల మంది జాలర్లు రామేశ్వరం నుంచి శనివారం 500కు పైగా పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. కచ్చదీవి సమీపంలో రాత్రివేళ చేపలు పడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి పడవల్లో వచ్చిన శ్రీలంక నౌకాదళం సరిహద్దు దాటి చేపలు పడుతున్నారంటూ రామేశ్వరం జాలర్లపై రాళ్లు, బాటిళ్లు విసిరి అక్కడినుంచి వెళ్లగొట్టింది. దీంతో భీతిచెందిన జాలర్లు తీరానికి చేరుకున్నారు. ఓక్కి తుపాన్ తర్వాత సముద్రంలోకి వెళుతున్న తమపై శ్రీలంక నౌకాదళం వరుసగా దాడులు జరుపుతోందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని జాలర్లు వాపోయారు. -
350 భారత జాలర్లకు విముక్తి
-
350 భారత జాలర్లకు విముక్తి
కరాచీ: పాకిస్తాన్ ప్రాదేశిక జాలాల్లో వేట సాగించి అరెస్టైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కేసు విచారణ కోసం మలిర్ జిల్లా జైలుకు చేరుకున్న న్యాయమూర్తి సల్మాన్ అంజాద్ సిద్దిఖీ ముందు నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో 350 మందిని స్వదేశానికి పంపే ఏర్పాటు చేయాలని సిద్దికీ అధికారుల్ని ఆదేశించారు. జనవరి 27 నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్న సమయాన్ని శిక్షాకాలంగా పరిగణించిన ఆయన.. మానవతా దృక్పథంతో జాలర్లను విడుదల చేస్తున్నట్లు తీర్పునిచ్చారు. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వీరిని ఇంతకుముందు అదుపులోకి తీసుకుంది. వీరందరిపై డాక్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేసింది. -
పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి
ఇస్లామాబాద్: అక్రమంగా పాక్ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పిచ్చింది. జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ మాలిర్ సల్మాన్ అంజిద్ సిద్ధిఖీ ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేశారు. భారత జాలర్లు ఇప్పటికే 8 నెలల జైలు శిక్ష అనుభవించారని, వారు చేసిన నేరానికి ఆ శిక్ష సరిపోతుందన్నారు. వెంటనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. ఇరుదేశాలకు చెందిన జాలర్లు పొరపాటున పొరుగుదేశ జలాల్లోకి ప్రవేశించి అరెస్ట్ కావడం గత కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. అరేబియా సముద్రంలో ఏ దేశానికి ఎంతమేరకు జలసరిహద్దు ఉందో కచ్చితమైన సమాచారం లేకపోవడంతోనే వందల సంఖ్యలో జాలర్లు ఇలా పొరుగు దేశంలో జైలు పాలు కావాల్సి వస్తుందని పాక్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
బంధించినా... కాపాడారు
అహ్మదాబాద్: భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి తమను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ తీరప్రాంత భద్రత సంస్థ(పీఎంఎస్ఏ) అధికారులను భారత జాలర్లు కాపాడిన సంఘటన ఆదివారం గుజరాత్ తీరంలో చోటుచేసుకుంది. భారత జాలర్లను పాక్ అధికారులు కరాచీకి తీసుకెళ్తున్న సమయంలో పాక్ పడవ ఒకటి భారత పడవను ఢీకొట్టి, మునిగిపోయింది. ఆ సమయంలో శత్రువులని కూడా చూడకుండా భారత జాలర్లు ఇద్దరు పాక్ అధికారులను రక్షించారు. మరో ముగ్గురు అధికారులు చనిపోయారు. ఇందుకు ప్రతిఫలంగా పీఎంఎస్ఏ కూడా ఉదారంగా స్పందించి సోమవారం రాత్రి భారత్‌కు చెందిన ఏడు పడవలు, 60 మంది జాలర్లను విడుదల చేసినట్లు జాతీయ జాలర్ల ఫోరం కార్యదర్శి మనీశ్ లోధారి తెలిపారు. కులభూషణ్ జాదవ్ వ్యవహారంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భారతకు జాలర్లను పట్టుకునేందుకు పాక్ చేసిన యత్నం విషాదాంతమైందని ఓ అధికారి తెలిపారు. -
ఆ పార్సిళ్లను వెనక్కి పంపుతున్న పాక్
డామన్: పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారత జాలర్లకు వారి బంధువులు పంపుతున్న పార్సిళ్లను ఆ దేశ జైళ్ల అధికారులు వెనక్కి పంపుతున్నారు. గత 9 నెలల్లో సరిహద్దు జాల్లాలో పట్టుబడిన.. గుజరాత్‌కు చెందిన 438 మంది, డయ్యూకు చెందిన 51 మంది జాలర్లు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్నారు. లేఖలు, ఆహార పదార్థాలు, దుస్తులు, మందులు తదితరాలను కరాచీ జైళ్లలోని జాలర్లకు బంధువులు పంపేవారు. అధికారులు కూడా వాటిని జాలర్లకు అందజేసేవారు. అయితే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ సర్జికల్ దాడులు అనంతరం.. ఇలాంటి పార్సిళ్లను వెనక్కి పంపిస్తున్నారని డయ్యూ మత్స్య శాఖ అధికారి శుకర్ అంజనీ తెలిపారు. తాము పంపిస్తున్న పార్సిళ్లు తిరిగి వస్తున్నాయని మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వీటిపై కరాచీ జైలు స్టాంప్ కూడా ఉండడంతో పాకిస్థాన్ వెళ్లిన తర్వాతే పార్సిళ్లు తిరిగివస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు. -
59 మంది భారత మత్స్యకారులు అరెస్ట్ : పాక్
ఇస్లామాబాద్ : పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించి... చేపలు పడుతున్న 59 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసినట్లు మీడియా శుక్రవారం వెల్లడించింది. వీరంతా అరేబియన్ సముద్రంలో చేపలు పడుతున్న క్రమంలో వీరందరిని నావిక భద్రత సంస్థకు చెందిన సిబ్బంది గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ మత్స్యకారుల్లో అత్యధిక మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారని ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. అయితే పాక్ గత నెల మార్చి 6వ తేదీన ఆ దేశ జైల్లో ఉన్న 87 మంది భారత మత్స్యకారులను విడుదల చేసింది. అలాగే మార్చి 20వ తేదీన మరో 86 మందిని కూడా పాక్ విడుదల చేసింది. వీరందరిని పాక్ ఉన్నతాధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు అప్పగించారు. అలాగే మార్చి 17వ తేదీన దేశ జైళ్లలో మగ్గుతున్న తొమ్మిది మంది పాక్ మత్స్యకారులను భారత్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు జరిగిన కొద్ది రోజులకే పాక్ 59 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేయడం గమనార్హం. -
మరో 23 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
కోలంబో : 23 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారికి చెందిన మూడు బోట్లను సీజ్ చేశారు. ఈ మేరకు మీడియా ఆదివారం వెల్లడించింది.వారంతా శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి.. చేపలు వేటాడుతున్నారని తెలిపింది. వీరిని మన్నార్ ప్రాంతంలో శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుందని పేర్కొంది. వారిని పోలీసులకు అప్పగించినట్లు ప్రకటించింది. అరెస్ట్ అయిన వారిలో 15 ఏళ్ల నుంచి 56 ఏళ్ల మధ్య వయస్సు వారు ఉన్నారని చెప్పింది. అరెస్ట్ అయిన మత్స్యకారులను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తారని తెలిపింది. -
87మంది భారత జాలర్లను విడిచిపెట్టిన పాక్
అమృత్సర్: భారత జాలర్లకు పాకిస్థాన్ చెర నుంచి విముక్తి లభించింది. తమ ఆధీనంలోని ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో 87 మంది భారత జాలర్లు పాక్ ఇటీవల బంధీ చేసింది. తాజగా పాకిస్థాన్ తమ జైళ్లలో ఉన్న ఖైదుగా ఉన్న భారత జాలర్లను దయతలచి విడిచిపెట్టింది. పంజాబ్ లోని వాఘా సరిహద్దు ప్రాంతం నుంచి వారిని భారత్ కు తిప్పి పంపించింది. పాక్ చర్యపై బాధిత జాలర్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఎనిమిది మంది మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావిక దళం గురువారం వెల్లడించింది. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను కూడా సీజ్ చేసినట్లు ప్రకటించింది. శ్రీలంక సముద్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వారిని కంగేసన్తురాయి ఓడరేవు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అరెస్ట్ చేసిన వారంతా తమిళనాడుకు చెందిన మత్య్సకారులను పేర్కొంది. శ్రీలంక నావికాదళ ప్రకటనపై రామేశ్వరంలోని మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎస్ శేఖర్ స్పందించారు. ఈ వార్త నిజమేనన్నారు. -
12 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
కోలంబో : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపలు పడుతున్న 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం గురువారం వెల్లడించింది. వారికి చెందిన రెండు బోట్లు కూడా సీజ్ చేసినట్లు పేర్కొంది. అరెస్ట్ చేసిన మత్స్యకారులంతా తమిళనాడుకు చెందిన వారని... వారిని శ్రీలంక మత్స్యశాఖ ప్రతినిధులకు అప్పగించినట్లు నావికా దళం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని రామేశ్వరం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ ధృవీకరించారు. కచ్చతీవు సమీపంలో సదరు మత్స్యకారులంతా చేపలు వేట చేస్తున్న సమయంలో శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేసిందని చెప్పారు. -
126 మంది భారత జాలర్ల విడుదల
కొలంబో: భారత్‌కు చెందిన 126 మంది జాలర్లను శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. తమ సముద్రజలాల్లో చేపలు వేటాడుతున్నారనే నెపంతో శ్రీలంక నేవి అధికారులు వీరిని గతంలో అరెస్ట్ చేశారు. అయితే గత కొంత కాలంగా భారత్, శ్రీలంక అధికారుల మధ్య జాలర్ల విడుదలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నేడు శ్రీలంక ప్రభుత్వం జాలర్లను భారత్‌కు అప్పగించింది. వీరిలో 78 మంది జాలర్లను కన్‌కేసంతురాయ్ తీరం వద్ద 'సాగర్' నౌకా సిబ్బందికి అప్పగించగా, మిగిలిన వారిని 'రాజ్ కమల్' నౌకా విభాగానికి అప్పగించినట్లు శ్రీలంక నావీ స్పోక్స్ పర్సన్ అక్రమ్ అలవి వెల్లడించారు. ఇటీవలి కాలంలో భారత్, శ్రీలంక దేశాల మధ్య మత్స్యకారుల విడుదల విషయం ద్వైపాక్షిక సంబంధాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా మత్స్యకారుల అంశం చర్చకు వచ్చింది. అలాగే భారత జాలర్లపై విధించిన భారీ జరిమానాలపై కూడా పునరాలోచించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. -
భారత జాలర్లను విడుదల చేస్తాం
చెన్నై : గత రెండు నెలలో అరెస్ట్ అయిన భారత జాలర్లను విడుదల చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది. వారిని ఈ నెల అక్టోబర్ 28వ తేదీన విడుదల చేస్తామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తమిళనాడు ప్రభుత్వానికి వెల్లడించింది. శ్రీలంక నుంచి జాలర్లను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22, అక్టోబర్ 14 తేదీల్లో తమిళనాడుకు చెందిన 86 మంది జాలర్లు శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో సదరు జాలర్లను శ్రీలంక సైన్యం అరెస్ట్ చేసింది. ఈ అంశంపై జయలలిత ప్రభుత్వం వెంటనే స్పందించింది. జాలర్ల విడుదలకు చర్యలు చేపట్టాలని మోదీ ప్రభుత్వానికి జయలలిత ఏకంగా ఏడు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఆ క్రమంలో జాలర్ల విడుదలకు శ్రీలంక ఒప్పుకుంది. 86 మంది భారత జాలర్లు తమిళనాడులోని నాగపట్టణం, పుదుకొటై, రామనాథపురం జిల్లాలకు చెందినవారు. -
తమిళులకు అధికారాలు ఇవ్వాలి
శ్రీలంక తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను ఇవ్వాలి * 13వ రాజ్యాంగ సవరణను అమలుచేయాలి * భారత జాలర్లను ప్రోత్సహించాలి: ఉగ్రవాదంపై సమష్టిపోరు * భారత-శ్రీలంక చర్చల్లో ప్రధాని మోదీ * ఆరోగ్య, అంతరిక్ష విజ్ఞాన ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు. జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా పోరాడటంతో పాటు, ఇరుదేశాల మధ్య భద్రత, సుస్థిరతల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. శ్రీలంకలో వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చిన విక్రమసింఘేను మోదీ ప్రశంసించారు. భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా ఇరుదేశాల ప్రధానుల మధ్య విస్తృత ప్రాతిపదికన మంగళవారం చర్చలు జరిగాయి. తమిళులకు న్యాయం చేయటం పైనే ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ, రెండు దేశాల నడుమ సుదీర్ఘంగా నలుగుతున్న జాలర్ల సమస్య, వ్యాపార, రక్షణ వ్యవస్థల బలోపేతం, ఉగ్రవాదం, సముద్రజలాల సరిహద్దుల భద్రత వంటి అంశాలను కూడా వారు చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరా యి. వైద్య-ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష విజ్ఞానంలో పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చర్చల అనంతరం మోదీ, విక్రమ సింఘేలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రక్షణ, భద్రత అంశాలలో పరస్పరం నిబద్ధతతో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ‘‘ఇరు దేశాల మధ్య రక్షణ ప్రయోజనాలను మేం గుర్తించాం. భద్రతా శిక్షణ రంగంలో భారత్‌కు అతి పెద్ద భాగస్వామి అయిన శ్రీలంకతో ఈ సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. తమిళులతో పాటు, శ్రీలంక ప్రజలంతా సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవాలతో జీవించాలి. రాజ్యాంగపరంగా వారికి దక్కాల్సిన అధికారాలను అందించాలి. జాలర్ల సమస్యకు సంబంధించి రెండు దేశాల జాలర్ల సంఘాలు కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కారాన్ని అన్వేషించాలి. ఈ అంశాన్ని మానవీయ కోణంలో చూడాలని నేను విక్రమ సింఘేకు తెలిపాను. సముద్ర జలాల్లో మరింత లోతుల్లో చేపల వేటకు భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం ప్రోత్సహించాలి’’ అని మోదీ తెలిపారు. ఆర్థిక భాగస్వామ్యం అంశంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని, వచ్చేఏడాదికల్లా తుదిరూపుకొస్తుందని మోదీ అన్నారు. శ్రీలంకలో మౌలిక వనరులు, ఇంధన, రవాణా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ పెట్టుబడిదారులు ముందుకు రావాలని మోదీ అన్నారు. శ్రీలంక ప్రధాని విక్రమసింఘే మాట్లాడుతూ, రాజ్యాంగం పరిధిలో తమిళులకు అధికారాలను సంక్రమింపజేయటానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. శ్రీలంకలో మైనారిటీలో ఉన్న తమిళులకు అధికారాలను సంక్రమింపజేయటం కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని భారత్ చాలాకాలంగా శ్రీలంకను కోరుతోంది. 1987లో అప్పటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనే, అప్పటి భారత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీల మధ్య జరిగిన ఒప్పందం మేరకే 13వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారం తమిళులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు కొన్ని అధికారాలను ఇవ్వాల్సి ఉంటుంది. సంగక్కరకు అభినందనలు క్రికెట్ రంగం నుంచి ఇటీవలే రిటైర్ అయిన శ్రీలంక క్రీడాకారుడు కుమార సంగక్కరను మోదీ ప్రశంసించారు. సంగక్కర గొప్ప బ్యాట్స్‌మన్ అని.. శ్రీలంకతరఫున అతని ఆట చూడలేకపోవటం లోటేనని ఆయన అన్నారు. ‘మనం ఇటీవలే శ్రీలంకతో టెస్ట్‌సిరీస్ పూర్తి చేసి వచ్చాం.. ఇకపై గ్రేట్ కుమార సంగక్కరను మిస్అవుతున్నాం’ అని ఆయన అన్నారు. భారత్-లంకల మధ్య వారధి.. భారత్ శ్రీలంకల మధ్య రూ. 34 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన సముద్ర రహదారి, సముద్రగర్భం లో సొరంగ మార్గ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఓడరేవుల మంత్రి నితిన్ గడ్కారీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో మంగళవారం చర్చించారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం ఖరారైతే, శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత సరిహద్దులోని ధనుష్కోటి దాకా 22 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో సొరంగ మార్గాన్ని నిర్మిస్తారు. -
పాక్ జైలు నుంచి162 మంది భారతీయ జాలర్ల విడుదల
కరాచీ : కరాచీ జైలులోని 162 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన భారతీయ జాలర్లు తరుచు పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆ క్రమంలో వారిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే విడుదలైన వారిలో 11 ఏళ్ల బాలుడు కూడా ఉండటం గమనార్హం. -
భారత జాలర్లు వస్తే కాల్చేస్తాం: లంక ప్రధాని
కొలంబో: లంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని షూట్ చేస్తామని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే హెచ్చరించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం శ్రీలంక పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉత్తర లంక ప్రజల జీవనోపాధిని భారత జాలర్లు కొల్లగొడుతున్నారని ‘తంతి టీవీ’ అనే తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. ‘ఎవరైనా నా ఇంట్లోకి దౌర్జన్యంగా జొరబడేందుకు ప్రయత్నిస్తే నేను వారిని కాల్చేస్తా. అందుకు చట్టం నన్ను అనుమతిస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నాకు సంబంధించినంతవరుకు నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి మా జలాలు. ఇందులో చేపలు పట్టుకునేందుకు జాఫ్నా జాలర్లను అనుమతించాలి. వారిని అడ్డుకోవడం వల్లనే భారత్ నుంచి జాలర్లు ఇక్కడికొస్తున్నారు. పైగా మనతో భారత జాలర్లు ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదిస్తున్నారు. అందుకు అభ్యంతరం లేదుగానీ ఉత్తర లంక జాలర్ల ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టలేం. అది కుదరనే కుదరదు’ అని అన్నారు. గత కొన్నేళ్ల కాలంలో దాదాపు 600 మంది భారత జాలర్లను లంక నావికాదళ సిబ్బంది హతమార్చినట్టు వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, ‘ఇటీవలి కాలంలో మాత్రం అలాంటి సంఘటనలు జరుగలేదు. 2011లో మాత్రం అలాంటి ఓ సంఘటన జరిగినట్టు గుర్తు. గతంలో ఎల్టీటీఈ మిలిటెంట్లకు ఆయుధాలు అందజేసేందుకు భారత్ నుంచి వచ్చేవారు’ అని ఆయన చెప్పారు. -
సంబంధాల పునరుద్ధరణకు పాక్ అడుగులు
లాహోర్: భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్ అడులుగు వేస్తోంది. పాకిస్తాన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 173 మంది భారతీయులను పాక్ సోమవారం భారత అధికారులకు అప్పగించింది. కరాచి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 172 మంది భారత జాలర్లతోపాటు మరో ఖైదీని పాక్ ఆదివారం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు వారిని అప్పగించారు. అరేబియా సముద్రంలోని తమ జలాల్లోకి ప్రవేశించారని వారిని అరెస్టు చేశారు. శిక్ష ముగిసిన తరువాత వారిని విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారత, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో వీరిని విడుదలచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల్లో ఉన్న ఇరుదేశాల ఖైదీల సమస్యను పాక్ మానవతా దక్పథంతో చూస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. -
రెండు భారత పడవలు పట్టుకున్న పాక్
న్యూఢిల్లీ: ముంబై ముట్టడి తరహా దాడికి యత్నించి విఫలమైన పాకిస్థాన్ మరో కుతంత్రానికి పాల్పడింది. రెండు భారతీయ మత్స్యకార పడవలను పాకిస్థాన్ పట్టుకుంది. జెలీల్, జలరామ్ పేరు గల ఈ పడవల్లో12 మంది జాలర్లు ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో శనివారం రాత్రి ఈ పడవలను పట్టుకున్నట్టు సమాచారం. పట్టుకున్న 12 మందిని ఎక్కడకు తీసుకెళ్లారనేది తెలియరాలేదు. అరేబియా సముద్రం తీరం నుంచి గుజరాత్ లో చొరబడేందుకు డిసెంబర్ 31న పాకిస్థాన్ బోటు విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఆ పడవలోని సిబ్బంది తమను తాము పేల్చేసుకున్నారు. -
61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్
ఇస్లామాబాద్: పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 61 మంది భారతీయ మత్స్యకారుల (జాలర్లు)ను ఆ దేశ మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న 11 బోట్లను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ మేరకు స్థానిక మీడియా డాన్ శుక్రవారం వెల్లడించింది. భారత మత్స్యకారులు పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన... పాక్ మత్స్యకారులు భారత ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన వారిపై ఆయా దేశాల మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్న విషయం విదితమే. -
'తమిళ జాలర్ల విడుదలకు భారత్ యత్నం'
కొలంబో/న్యూఢిల్లీ: శ్రీలంకలో మరణశిక్ష పడ్డ ఐదుగురు తమిళ జాలర్లను భారత హైకమిషనర్ మంగళవారం ఉదయం కలిశారు. కొలంబోలోని వెలికడ జైల్లో ఉన్న ఐదుగురు మత్స్యకారులను భారత దౌత్యాధికారి యాష్ సిన్హా కలిశారు. వీలైనంత త్వరగా జైలు నుంచి విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారితో చెప్పారు. వెలికడ జైలు సూపరిండెంటెంట్ కార్యాలయంలో ఐదుగురు జాలర్లను యాష్ సిన్హా కలిశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయిద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో చెప్పారు. వారికి అవసరమైన దుస్తులు, వస్తువులు అందజేశారని తెలిపారు. వారికి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. జాలర్ల విడుదలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్న విషయాన్ని వారికి చెప్పారన్నారు. -
లంక జెండాల దహనం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళజాలర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి జయలలిత రాసిన ఉత్తరాలను కించపరుస్తూ శ్రీలంక ఆర్మీ వెబ్సైట్లో కార్టూన్ వేసిన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. పార్లమెంట్ ఉభయసభలు ఈఅంశంపై అట్టుడికి పోయాయి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం ఏకమై శ్రీలంక వైఖరిని ఎండగ ట్టింది. చెన్నై నుంగంబాక్కంలోని శ్రీలంక సహాయ రాయబార కార్యాలయాన్ని రాష్ట్రం నుంచి తొలగించాలని, లేకుంటే దానిపై దాడులకు దిగుతామని సోమవారం నాటి ధర్నాలో కోలీవుడ్ హెచ్చరించింది. కొందరు ఆందోళనకారులు మంగళవారం రాయబార కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకుంటున్నా లెక్కచేయక కొందరు ఆందోళనకారులు అకస్మాత్తుగా శ్రీలంక జాతీయ పతాకాలను బయటకు తీసి దహనం చేశారు. వాటిని ఆర్పేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. శ్రీలంక వైఖరికి నిరసనగా అల్లర్లు కొనసాగడంతో నగరంలో ఆ దేశానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు, సంస్థలకు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
మళ్లీ చర్చలు!
శ్రీలంక - తమిళ జాలర్ల మధ్య మళ్లీ భేటీకి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరులో మలివిడత చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. తొలి విడత చర్చల అనంతరం కూడా రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుండడంతో డీఎంకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఎంపీ ఇళంగోవన్ బృందం బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయింది. సాక్షి, చెన్నై: కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులతో పాటు జాలర్లను పట్టుకెళ్లి కారాగారాల్లో బంధిస్తున్నారు. పడవల్ని స్వాధీనం చేసుకుని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని జాలర్లలో ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. దీంతో రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చలకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం, డీఎంకే వర్గాలు ఒత్తిడి పెంచాయి. ఎట్టకేలకు కొన్నేళ్ల తర్వాత గత నెల 27న చెన్నై వేదికగా చర్చలు మొదలయ్యూ. అయితే, చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల్ని మాత్రం గోప్యంగా ఉంచారు. రెండు దేశాల జాలర్ల ప్రతినిధులు చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసినా, శ్రీలంక నావికాదళం మాత్రం తనప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఆగని దాడులు: చర్చలు విజయవంతం అయి నా, రాష్ట్ర జాలర్ల మీద దాడులు మాత్రం ఆగలేదు. చర్చల అనంతరం ఐదు సార్లు కడలిలో రాష్ట్ర జాలర్లపై దాడి జరిగింది. 88 మందిని, పదికి పైగా పడవలను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లింది. దీంతో ఆ చర్చలు ఏఏ అంశాల చుట్టూ సాగాయో, వాటికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్ని ప్రకటించాలన్న డిమాండ్‌తో జాలర్లు ఆందోళన చేశారు. జాలర్లపై దాడుల పరంపర కొనసాగుతోండటంతో సీఎం జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి లేఖల ద్వారా పీఎంకు జాలర్ల వెతల్ని ఏకరువు బెట్టారు. తన ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి కరుణానిధి పంపించారు. ఉత్తర చెన్నై ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని ఐదుగురితో కూడిన ప్రతినిధుల బృందం గురువారం ఉద యం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయింది. జాలర్లపై కొనసాగుతున్న దాడుల్ని వివరిస్తూ వినతి పత్రం సమర్పించింది. దాడులకు అడ్డుకట్ట వేయడం, రెండు దేశాల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని బయట పెట్టించాలని, శ్రీలంక అధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యకు ముగింపు పలకాలని విన్నవించారు. ఏర్పాట్లు: శ్రీలంక జాలర్ల ప్రతినిధులు ప్రకటించిన మేరకు మళ్లీ చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. గత నెల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలకు శ్రీలంక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తమిళుల డిమాండ్లకు తలొగ్గిన ఆ దేశ ప్రభుత్వం, కొన్ని మెలికలతో కూడిన కొత్త అంశాల్ని తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. వీటన్నింటిపై చర్చించి, రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలి విడతగా రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరులో ఈ చర్చలు జరగడం ఖాయమని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి రజిత సేన ప్రకటించారు. మూడు తేదీలు ఎంపిక చేసి భారత ప్రభుత్వానికి పంపుతామని, కొలంబో వేదికగా మలి విడత చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల ద్వారానైనా జాలర్లపై దాడులు ఆగేనా, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే! -
జాలర్లకు విముక్తి
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక చెరలో మగ్గుతున్న 52 మంది తమిళ జాల ర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలి తంగా 51 మంది జాలర్లు గురువారం రాత్రి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. మరో జాలరి గుండెపోటుకు గురై శ్రీలంక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సముద్రంలో సరిహద్దు సమస్యను సాకుగా చేసుకుని శ్రీలంక నావికా దళం తరచూ తమిళ జాలర్లపై దాడులకు దిగుతోంది. అలాగే వారిని అరెస్టు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే శ్రీలంక ప్రభుత్వం కంటితుడుపుగా కొందరిని విడిచిపెడుతోంది. రెండు దేశాల జాలర్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు జాలర్ల సంఘాల ప్రతినిధులతో కేంద్రం ఈ నెల 20వ తేదీన చెన్నైలో చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చర్చలు సామరస్యంగా సాగాలన్న తలంపుతో శ్రీలంక ప్రభుత్వం తమ చెరలో ఉన్న జాలర్లను అక్కడి కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని విడుదల చేసేందుకు అంగీకరించింది. తమ మరబోట్లను అప్పగించాలని తమిళ జాలర్లు డిమాండ్‌ను శ్రీలంక తోచిపుచ్చింది. వాటిని ఇచ్చేది లేదని ఖరాకండిగా చెప్పింది. తమకు జీవనాధారమైన మరబోట్లను అప్పగిస్తేగాని నౌక ఎక్కబోమని జాలర్లు భీష్మించారు. శ్రీలంక దళాల వైఖరితో దిగాలు పడిన కారైక్కాల్ జిల్లా పట్టినచ్చేరికి చెందిన మరబోట్ల యజమాని పొన్నుస్వామి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని శ్రీలంకలోని ఆస్పత్రిలో చేర్పించారు. పొన్నుస్వామి కోలుకున్న తర్వాత విమానంలో పంపుతామని శ్రీలంక దళాలు పేర్కొన్నారుు. మిగిలిన 51 మంది జాలర్లను బలవంతంగా నౌకలోకి ఎక్కించాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు శ్రీలంకలోని కొడియ సముద్రతీరం నుంచి బయలుదేరిన నౌక 16 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి జాతీయ ఉమ్మడి సరిహద్దుకు చేరుకుంది. భారత్ ఇటీవలే సేవల్లోకి తెచ్చిన విశ్వాస్ట్ గస్తీ నౌక ద్వారా గురువారం రాత్రి జాలర్లు కారైక్కాల్ చేరుకున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయపాల్, నాగపట్నం జిల్లా కలెక్టర్ మునుస్వామి వారికి స్వాగతం పలికారు. తమవారి రాకకోసం ఎదురుచూస్తున్న జాలర్ల కుటుంబాల వారు ఉద్వేగానికి గురై ఆనంద భాష్పాలు రాల్చారు. శ్రీలంక చెరలో ఉన్న మిగిలిన మత్స్యకారులు దశలవారీగా విడుదలవుతారని ఈ సందర్భంగా మంత్రి మీడియాకు తెలిపారు. జాలర్ల సంఘాల ప్రతినిధులతో ఈ నెల 20వ తేదీన జరగనున్న చర్చల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరబోట్లతోనే మా బతుకు శ్రీలంక ప్రభుత్వం తమను విడిచిపెట్టి మరబోట్లను అప్పగించకపోవడం దారుణమని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక చెరలో తాము పడిన కష్టాలు వర్ణనాతీతమని వాపోయారు. తమను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మరబోట్లను సైతం అప్పగించాలని న్యాయమూర్తులు ఆదేశించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం శ్రీలంక ప్రభుత్వం ధిక్కరించి అన్యాయం చేసిందనిఆరోపించారు. మరబోట్లు దక్కవనే బెంగతోనే వాటి యజమాని పొన్నుస్వామి గుండెపోటుకు గురయ్యూడని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మరబోట్లు విడిపించాలని, లేదా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. -
30మంది భారత మత్స్యకారుల రిమాండ్ పొడగింపు
రామేశ్వరం: శ్రీలంక జైల్లో రిమాండ్ ఖైదీలుగా వున్న 30మంది భారత మత్స్యకారుల రిమాండ్‌ను శ్రీలంక కోర్టు పొడగించింది. వీరి రిమాండ్ గడవు ముగియడంతో ఆ కోర్టు 2014 జనవరి 3వ తేదీ వరకు పొడగించినట్టు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. గత నెలలో శ్రీలంక జలశయాల్లోకి చేపల వేటకు వెళ్లిన భారత మత్స్యకారులను అక్రమంగా ప్రవేశించారనే నేపంతో జాతీయ ద్వీప సరిహద్దు ప్రాంత శ్రీలంక నావికదళం అరెస్ట్ చేసింది. శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినా ఈ మత్స్యకారులందరూ పుదుకొట్టాయి, రామేశ్వరంలకు చెందినవారు.