61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్ | Pakistan arrests 61 Indian fishermen | Sakshi
Sakshi News home page

61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్

Published Fri, Nov 21 2014 10:21 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

Pakistan arrests 61 Indian fishermen

ఇస్లామాబాద్: పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 61 మంది భారతీయ మత్స్యకారుల (జాలర్లు)ను ఆ దేశ మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న 11 బోట్లను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ మేరకు స్థానిక మీడియా డాన్ శుక్రవారం వెల్లడించింది. భారత మత్స్యకారులు పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన... పాక్ మత్స్యకారులు భారత ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన వారిపై ఆయా దేశాల మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్న విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement