కోలంబో : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపలు పడుతున్న 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం గురువారం వెల్లడించింది. వారికి చెందిన రెండు బోట్లు కూడా సీజ్ చేసినట్లు పేర్కొంది. అరెస్ట్ చేసిన మత్స్యకారులంతా తమిళనాడుకు చెందిన వారని... వారిని శ్రీలంక మత్స్యశాఖ ప్రతినిధులకు అప్పగించినట్లు నావికా దళం ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ సమాచారాన్ని రామేశ్వరం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ ధృవీకరించారు. కచ్చతీవు సమీపంలో సదరు మత్స్యకారులంతా చేపలు వేట చేస్తున్న సమయంలో శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేసిందని చెప్పారు.