Lankan Navy
-
తమిళ జాలర్ల అరెస్ట్
రామేశ్వరం : తమిళనాడుకు చెందిన ఐదుమంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. హిందూమహాసముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్పకారులు.. పొరపాటును శ్రీలంక ప్రాదేశిక జలాల్లోని నెడుంతీవు ప్రాంతానికి వెళ్లడంతో అదుపులోకి తీసుకున్నట్లు లంక నేవీ అధికారలు ప్రకటించారు. అంతేకాక జాలర్లకు చెందిన పడవలను సీజ్ చేసినట్లు మణికండన్ అనే అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. కచ్చాతీవులో చేపల వేటకు వెళ్లిన తమిళ జాలర్లను లంక నేవీ అధికారులు వెంటాడినట్లు రామేశ్వరం జాలర్ల సంఘం అధ్యక్షుడు ఎమ్రీత్ చెప్పారు. లంక నేవీ అధికారులు వెంటాడడంతో 50 మంది జాలర్లు.. వేగంగా వెనక్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. నెడుంతీవు తీరంలో చేవల వేటకు వెళ్లిన పదిమంది జాలర్లను ఈ నెల 8న లంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. వీరిని విడుదల చేయించేందుకు తమిళనాడు, భారత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
శ్రీలంక అదుపులో భారత జాలర్లు
కొలంబో: తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక నేవి లెఫ్టినెంట్ కమాండర్ చమిందా మీడియాకు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి బోటుతో పాటు పలు సామన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
10 మంది భారత జాలర్ల అరెస్ట్
కొలంబో: శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 10 మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. సముద్రంలో జాలర్లు ప్రయాణించడానికి ఉపయోగించిన ఓ బోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. జాలర్లు అక్రమంగా మా జలాల్లోకి ప్రవేశించడం ఆపకపోతే అరెస్ట్లు కొనసాగుతాయని శ్రీలంక మత్స్యకార మంత్రి మహీంద్ర అమరవీర ప్రకటించారు. సముద్రజలాల వివాదంపై వచ్చేనెలలో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. గత నెలలో శ్రీలంక నేవీ జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఓ జాలరి చనిపోయిన సంగతి తెల్సిందే. -
శ్రీలంక అదుపులో భారత జాలర్లు
రామేశ్వరం: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో శ్రీలంక నేవి సిబ్బంది 13 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను సీజ్ చేయడంతో పాటు చేపల వేటకు వినియోగించే 20 వలలను ధ్వంసం చేశారు. రామేశ్వర తీరంలోని వాడమరచి వద్ద శ్రీలంక ప్రదేశిక జలాల్లో చేపలు పడుతున్న నలుగురు మత్స్యకారులతో పాటు, అక్కరాయిపెట్టాయి వద్ద తొమ్మిది మందిని అరెస్ట్ చేసి నాగపట్టినమ్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు మత్స్య శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ అమల జేవేరియా తెలిపారు. గత నెలలో కూడా రామేశ్వరానికి చెందిన10 మంది మృత్య కారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. -
ఎనిమిది మంది మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావిక దళం గురువారం వెల్లడించింది. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను కూడా సీజ్ చేసినట్లు ప్రకటించింది. శ్రీలంక సముద్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వారిని కంగేసన్తురాయి ఓడరేవు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అరెస్ట్ చేసిన వారంతా తమిళనాడుకు చెందిన మత్య్సకారులను పేర్కొంది. శ్రీలంక నావికాదళ ప్రకటనపై రామేశ్వరంలోని మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎస్ శేఖర్ స్పందించారు. ఈ వార్త నిజమేనన్నారు. -
12 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
కోలంబో : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపలు పడుతున్న 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం గురువారం వెల్లడించింది. వారికి చెందిన రెండు బోట్లు కూడా సీజ్ చేసినట్లు పేర్కొంది. అరెస్ట్ చేసిన మత్స్యకారులంతా తమిళనాడుకు చెందిన వారని... వారిని శ్రీలంక మత్స్యశాఖ ప్రతినిధులకు అప్పగించినట్లు నావికా దళం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని రామేశ్వరం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ ధృవీకరించారు. కచ్చతీవు సమీపంలో సదరు మత్స్యకారులంతా చేపలు వేట చేస్తున్న సమయంలో శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేసిందని చెప్పారు. -
8 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావిక దళ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ ఆదివారం రామేశ్వరంలో వెల్లడించారు. ఎనిమిది మందిలో నలుగురు రామేశ్వరం, మరో నలుగురు పుదుక్కోటైకు చెందిన మత్స్యకారులను తెలిపారు. సదరు మత్స్యకారులు శ్రీలంక ప్రాదేశిక నదీ జలాల్లోకి ప్రవేశించి...చేపలను వేట చేస్తున్న క్రమంలో వారిని శ్రీలంక నావిక దళ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఈనెల 26వ తేదీన 15 మంది భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున శ్రీలంక అరెస్ట్ చేసిన మత్య్సకారులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాసిన విషయం తెలిసిందే. -
16 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక
రామేశ్వరం: తమిళనాడు రాష్ట్రానికి చెందిన 16 మంది మత్య్సకారులను శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేశారని మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సదరు మత్స్యకారులంతా ఈ రోజు ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి... చేపల వేట చేస్తున్నారని తెలిపారు. దాంతో వారిని శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే వారికి సంబంధించిన 3 బోట్లను కూడా వారు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్ట్ అయిన మత్స్యకారులంతా పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని మత్స్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే సెల్వరాజ్ అనే మత్స్యకారుడు గత రాత్రి మరణించాడని....అతడి మృతదేహం బోట్లో ఉందని చెప్పారు. అతడి మరణానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు.