రామేశ్వరం : తమిళనాడుకు చెందిన ఐదుమంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. హిందూమహాసముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్పకారులు.. పొరపాటును శ్రీలంక ప్రాదేశిక జలాల్లోని నెడుంతీవు ప్రాంతానికి వెళ్లడంతో అదుపులోకి తీసుకున్నట్లు లంక నేవీ అధికారలు ప్రకటించారు. అంతేకాక జాలర్లకు చెందిన పడవలను సీజ్ చేసినట్లు మణికండన్ అనే అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా.. కచ్చాతీవులో చేపల వేటకు వెళ్లిన తమిళ జాలర్లను లంక నేవీ అధికారులు వెంటాడినట్లు రామేశ్వరం జాలర్ల సంఘం అధ్యక్షుడు ఎమ్రీత్ చెప్పారు. లంక నేవీ అధికారులు వెంటాడడంతో 50 మంది జాలర్లు.. వేగంగా వెనక్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. నెడుంతీవు తీరంలో చేవల వేటకు వెళ్లిన పదిమంది జాలర్లను ఈ నెల 8న లంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. వీరిని విడుదల చేయించేందుకు తమిళనాడు, భారత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment