శ్రీలంక అదుపులో భారత జాలర్లు
Published Thu, Mar 2 2017 2:38 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
రామేశ్వరం: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో శ్రీలంక నేవి సిబ్బంది 13 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను సీజ్ చేయడంతో పాటు చేపల వేటకు వినియోగించే 20 వలలను ధ్వంసం చేశారు. రామేశ్వర తీరంలోని వాడమరచి వద్ద శ్రీలంక ప్రదేశిక జలాల్లో చేపలు పడుతున్న నలుగురు మత్స్యకారులతో పాటు, అక్కరాయిపెట్టాయి వద్ద తొమ్మిది మందిని అరెస్ట్ చేసి నాగపట్టినమ్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు మత్స్య శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ అమల జేవేరియా తెలిపారు. గత నెలలో కూడా రామేశ్వరానికి చెందిన10 మంది మృత్య కారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది.
Advertisement
Advertisement