రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావిక దళ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ ఆదివారం రామేశ్వరంలో వెల్లడించారు. ఎనిమిది మందిలో నలుగురు రామేశ్వరం, మరో నలుగురు పుదుక్కోటైకు చెందిన మత్స్యకారులను తెలిపారు. సదరు మత్స్యకారులు శ్రీలంక ప్రాదేశిక నదీ జలాల్లోకి ప్రవేశించి...చేపలను వేట చేస్తున్న క్రమంలో వారిని శ్రీలంక నావిక దళ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పారు.
అయితే ఈనెల 26వ తేదీన 15 మంది భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున శ్రీలంక అరెస్ట్ చేసిన మత్య్సకారులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాసిన విషయం తెలిసిందే.