TN fishermen
-
31 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా చేపలు పడుతున్న 31 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం ఆదివారం వెల్లడించింది. వారికి చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు తెలిపింది. ఈ వార్తను తమిళనాడు మత్స్యశాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు. అరెస్ట్ అయిన 31 మంది మత్య్సకారులు తమిళనాడుకు చెందిన వారేనని చెప్పారు. వారిలో 22 మంది ట్యూటికారన్, మరో తొమ్మిది మంది రామేశ్వరంకు చెందిన వారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీన తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన భారత మత్స్యకారుల సంఖ్య 66కు పెరిగింది. -
8 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావిక దళ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ ఆదివారం రామేశ్వరంలో వెల్లడించారు. ఎనిమిది మందిలో నలుగురు రామేశ్వరం, మరో నలుగురు పుదుక్కోటైకు చెందిన మత్స్యకారులను తెలిపారు. సదరు మత్స్యకారులు శ్రీలంక ప్రాదేశిక నదీ జలాల్లోకి ప్రవేశించి...చేపలను వేట చేస్తున్న క్రమంలో వారిని శ్రీలంక నావిక దళ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఈనెల 26వ తేదీన 15 మంది భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున శ్రీలంక అరెస్ట్ చేసిన మత్య్సకారులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాసిన విషయం తెలిసిందే. -
16 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక
రామేశ్వరం: తమిళనాడు రాష్ట్రానికి చెందిన 16 మంది మత్య్సకారులను శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేశారని మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సదరు మత్స్యకారులంతా ఈ రోజు ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి... చేపల వేట చేస్తున్నారని తెలిపారు. దాంతో వారిని శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే వారికి సంబంధించిన 3 బోట్లను కూడా వారు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్ట్ అయిన మత్స్యకారులంతా పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని మత్స్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే సెల్వరాజ్ అనే మత్స్యకారుడు గత రాత్రి మరణించాడని....అతడి మృతదేహం బోట్లో ఉందని చెప్పారు. అతడి మరణానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు.