భారత జాలర్లను విడుదల చేస్తాం | Sri Lanka to release 86 Indian fishermen on Oct 28 | Sakshi
Sakshi News home page

భారత జాలర్లను విడుదల చేస్తాం

Published Sun, Oct 25 2015 2:05 PM | Last Updated on Thu, Jul 11 2019 6:22 PM

Sri Lanka to release 86 Indian fishermen on Oct 28

చెన్నై : గత రెండు నెలలో అరెస్ట్ అయిన భారత జాలర్లను విడుదల చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది. వారిని ఈ నెల అక్టోబర్ 28వ తేదీన విడుదల చేస్తామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తమిళనాడు ప్రభుత్వానికి వెల్లడించింది. శ్రీలంక నుంచి జాలర్లను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 22, అక్టోబర్ 14  తేదీల్లో తమిళనాడుకు చెందిన 86 మంది జాలర్లు శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో సదరు జాలర్లను శ్రీలంక సైన్యం అరెస్ట్ చేసింది. ఈ అంశంపై జయలలిత ప్రభుత్వం వెంటనే స్పందించింది. జాలర్ల విడుదలకు చర్యలు చేపట్టాలని మోదీ ప్రభుత్వానికి జయలలిత ఏకంగా ఏడు లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఆ క్రమంలో జాలర్ల విడుదలకు శ్రీలంక ఒప్పుకుంది. 86 మంది భారత జాలర్లు తమిళనాడులోని నాగపట్టణం, పుదుకొటై, రామనాథపురం జిల్లాలకు చెందినవారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement