కోలంబో : 23 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారికి చెందిన మూడు బోట్లను సీజ్ చేశారు. ఈ మేరకు మీడియా ఆదివారం వెల్లడించింది.వారంతా శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి.. చేపలు వేటాడుతున్నారని తెలిపింది. వీరిని మన్నార్ ప్రాంతంలో శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుందని పేర్కొంది. వారిని పోలీసులకు అప్పగించినట్లు ప్రకటించింది. అరెస్ట్ అయిన వారిలో 15 ఏళ్ల నుంచి 56 ఏళ్ల మధ్య వయస్సు వారు ఉన్నారని చెప్పింది. అరెస్ట్ అయిన మత్స్యకారులను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తారని తెలిపింది.