కరాచీ: పాకిస్తాన్ ప్రాదేశిక జాలాల్లో వేట సాగించి అరెస్టైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కేసు విచారణ కోసం మలిర్ జిల్లా జైలుకు చేరుకున్న న్యాయమూర్తి సల్మాన్ అంజాద్ సిద్దిఖీ ముందు నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో 350 మందిని స్వదేశానికి పంపే ఏర్పాటు చేయాలని సిద్దికీ అధికారుల్ని ఆదేశించారు.
జనవరి 27 నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్న సమయాన్ని శిక్షాకాలంగా పరిగణించిన ఆయన.. మానవతా దృక్పథంతో జాలర్లను విడుదల చేస్తున్నట్లు తీర్పునిచ్చారు. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వీరిని ఇంతకుముందు అదుపులోకి తీసుకుంది. వీరందరిపై డాక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేసింది.
350 భారత జాలర్లకు విముక్తి
Published Thu, May 25 2017 9:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
Advertisement