Pakistan Court
-
పాక్ గ్రే లిస్టులోనే..
న్యూఢిల్లీ: ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఉపకమిటీ సిఫారసు చేసింది. ఫ్రాన్సు రాజధాని ప్యారిస్‌లో జరుగుతున్న ఎఫ్ఏటీఎఫ్కు చెందిన ఐసీఆర్జీ(ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్)ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల 21వ తేదీన జరిగే ఎఫ్ఏటీఎఫ్ అత్యున్నత స్థాయి సమావేశం అంతిమ నిర్ణయం తీసుకోనుంది. 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ న్యాయస్థానం 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పాక్ కోర్టు ఈ నిర్ణయం వెలువరించడాన్ని గ్రే జాబితా నుంచి బయటపడేందుకు పాక్ చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. -
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు షాక్
ఇస్లామాబాద్ : 2008 ముంబై దాడుల సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్లో యాంటీ టెర్రరిజమ్ కోర్టు (ఏటీసీ) షాక్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారని నిర్థారణ కావడంతో అతడికి పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్టు హాఫీజ్‌పై నమోదైన రెండు కేసులపై విచారణ చేపట్టిన ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించి రూ. 15 వేల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో హాఫీజ్ 16 సార్లు అరెస్ట్ అయినప్పటికీ ప్రతిసారి ఎటువంటి శిక్ష పడకుండా విడుదల అవుతూనే ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న హాఫీజ్.. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది జూలైలో జమాత్-ఉద్-దవా(జేయూడీ)కి చెందిన 13 మంది కీలక సభ్యులు తాము సేకరించిన ఆర్థిక వనరులను ఉగ్ర సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 11 కేసుల్లో హాఫీజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు. -
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసి కోట్ లఖ్‌పత్ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
జాధవ్‌ను విడుదల చేయండి
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) సోమవారం కోరింది. కుల్‌భూషణ్ జాధవ్‌ను వెంటనే విడుదల చేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. జాధవ్‌పై నమోదైన అభియోగాలను నిరూపించడంలో పాక్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టింది. జాధవ్‌ను కలుసుకునేందుకు కనీసం భారత దౌత్యాధికారిని పాక్ అనుమతించలేదనీ, ఇది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంది. గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాల కింద దోషిగా తేలుస్తూ పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు 2017 ఏప్రిల్ 10న మరణశిక్ష విధించింది. జాధవ్‌ను పాక్ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసిందన్న భారత్.. మరణశిక్షను సవాలు చేస్తూ ఐసీజేను ఆశ్రయించింది. సోమవారం ఐసీజే ముందు భారత్ తరఫున వాదనలు వినిపించిన మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే పాక్‡శైలిని తీవ్రంగా ఎండగట్టారు. ఆర్మీ అధికారులే జడ్జీలు ‘జాధవ్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని భారత్ 13 సార్లు కోరింది. పాక్ వాటిని పట్టించుకోలేదు. కేసును విచారించిన పాక్ మిలటరీ కోర్టు జడ్జీలకు న్యాయ శిక్షణ లేదు. కనీసం న్యాయశాస్త్రంలో డిగ్రీ అవసరం లేదు. పాక్ మిలటరీ కోర్టులు గత రెండేళ్లలో 161 మంది పౌరులకు మరణశిక్ష విధించాయి. పాక్ మిలటరీ కోర్టుల్లో ఆర్మీ అధికారులే జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆర్మీలోని ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. మిలటరీ కోర్టులు పౌరుల్ని విచారించడంపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ పాక్ రాజ్యాంగాన్ని మార్చి మరణశిక్ష విధిస్తోంది’ అని మండిపడ్డారు. బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు జాధవ్ భారత గూఢచారి అని ఆరోపిస్తున్న పాకిస్తాన్ అందుకు తగ్గ సాక్ష్యాలను మాత్రం సమర్పించలేకపోయిందని సాల్వే విమర్శించారు. ‘ కేసులో జాధవ్‌కు కనీస న్యాయ సాయం అందించడంలో పాక్ ఘోరంగా విఫలమైంది. జాధవ్‌కు పాక్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. జాధవ్ ఉగ్రవాది అని చెబుతున్న పాక్ అందుకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని సమర్పించలేకపోయింది. ఆయన చేత బలవంతంగా నేరాంగీకార వాంగ్మూలాన్ని ఇప్పించారు. మూడేళ్లుగా జైలులో జాధవ్ అనుభవించిన మానసిక క్షోభను, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను విడుదల చేయాలని ఐసీజేను కోరుతున్నాం’ అని తెలిపారు. 3 నెలల గడువు ఎందుకు? జాధవ్‌ను 2016, మార్చి 3న అరెస్ట్ చేసిన పాకిస్తాన్ నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుచేసిందని సాల్వే అన్నారు. ‘విదేశీ పౌరులు గూఢచర్యం అభియోగం కింద అరెస్టయినా వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఆ విషయాన్ని సంబంధిత దేశానికి తెలియజేయాలి. కానీ అరెస్ట్‌పై పాక్ మాకు సమాచారమివ్వలేదు. దౌత్యసాయంపై ఒప్పందం ఉన్నప్పటికీ అది వియన్నా ఒప్పందానికి అనుబంధంగానే ఉంది. పాకిస్తాన్ వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు 3 నెలల గడువు ఎందుకు కావాలో పాక్ సమాధానం చెప్పాలి. జాధవ్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులను 2017, డిసెంబర్ 25న పాక్ అనుమతించినప్పటికీ, ఆ సందర్భంగా పాక్ అధికారుల తీరుపై భారత్ నిరసన తెలియజేసింది’ అని సాల్వే వెల్లడించారు. భారత్ వాదనలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం పాకిస్తాన్ తమ వాదనల్ని ఐసీజే ముందు వినిపించనుంది. పాక్ జడ్జికి గుండెపోటు ఇస్లామాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో జాధవ్ కేసు విచారణ సందర్భంగా పాక్ తాత్కాలిక జడ్జి హుస్సేన్ గిల్లానీ(69)కి గుండెపోటు వచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, హుస్సేన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్టికల్ 31 ప్రకారం ఐసీజేలో విచారణ సందర్భంగా సంబంధిత దేశానికి కోర్టులో ప్రాతినిధ్యం లేకపోతే అదే దేశానికి చెందిన వ్యక్తిని ఐసీజే బెంచ్ తాత్కాలిక జడ్జీగా ఎంపిక చేస్తుంది. ఆ తరహాలో తాజాగా ఐసీజే హుస్సేన్‌ను తాత్కాలిక జడ్జిగా నియమించింది. దీంతో ఐసీజేలో మొత్తం జడ్జీల సంఖ్య 16కు చేరుకుంది. ఐసీజేలో సాధారణంగా 15 మంది జడ్జీలు ఉంటారు. వీరు 9 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఐసీజేలో భారత్ తరఫున దల్వీర్ భండారీ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. పాక్ అధికారులకు ‘నమస్కారం’ జాధవ్ కేసు విచారణ సందర్భంగా ఐసీజే ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అధికారులతో కరచాలనం చేసేందుకు భారత అధికారులు నిరాకరించారు. జాధవ్ కేసు విచారణ మొదలయ్యే ముందు పాక్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్‌తో కరచాలనం చేసేందుకు చెయ్యి చాచగా, మిట్టర్ నమస్కారం పెట్టారు. దీంతో ఖాన్ నెదర్లాండ్స్‌లో భారత రాయబారి వేణు రాజమొనితో కరచాలనం చేసేందుకు యత్నించారు. కానీ అయన కూడా నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఈ ఘటనతో ఖంగుతిన్న అన్వర్ ఖాన్.. చివరికి చేసేదేం లేక భారత మాజీ అటార్నీ జనరల్ హరీశ్ సాల్వేతో కరచాలనం చేసి తన స్థానానికి వెళ్లి కూర్చున్నారు. మరోవైపు పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి, సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్‌కు కూడా మిట్టల్ నమస్కారంతోనే సరిపెట్టారు. -
నేటి నుంచి జాధవ్ విచారణ
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో సోమవారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకూ నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కోర్టు భారత్, పాకిస్తాన్ల వాదనల్ని విననుంది. ఈ కేసులో భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే, పాకిస్తాన్ తరఫున బారిస్టర్ ఖవార్ ఖురేషీ వాదనలు వినిపించనున్నారు. 2016, మార్చి 3న ఇరాన్ నుంచి బలోచిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించింది. ముస్లిం పేరున్న నకిలీ పాస్పోర్టుతో జాధవ్ పాక్‌లో గూఢచర్యం చేసేందుకు ప్రవేశించారనే నేరంపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
హఫీజ్ సయీద్‌ను విడిచిపెట్టిన పాక్!
లాహోర్: 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్‌కు విముక్తి లభించింది. గృహనిర్బంధంలో ఉన్న సయీద్‌ను విడుదల చేయాలని పాకిస్థాన్‌కు చెందిన పంజాబ్ జ్యుడీషియల్ రివ్యూ బోర్డు బుధవారం ఆదేశాలు జారీచేసింది. సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పిస్తే.. అంతర్జాతీయ సమాజం నుంచి మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావొచ్చని పాక్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసిన మరునాడే ఈ మేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం. సయీద్‌ను గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. అతన్ని పంజాబ్ ప్రభుత్వం మంగళవారం జ్యుడీషియల్ రివ్యూ బోర్డు ముందు హాజరు పరిచింది. అయితే, సయీద్‌కు వ్యతిరేకంగా తగినంత ఆధారాలు సమర్పించడంలో పాక్ సర్కారు విఫలమైందని, కాబట్టి, అతన్ని గృహనిర్బంధంలో కొనసాగించడం రివ్యూ బోర్డు స్పష్టం చేసింది. సయీద్ గృహనిర్బంధం కొనసాగించకుంటే.. అంతర్జాతీయ సమాజం దేశంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని, కాబట్టి అతన్ని గృహనిర్బంధం కొనసాగించాలని పంజాబ్ హోంశాఖ అధికారులు జ్యుడీషియల్ రివ్యూ బోర్డును కోరారు. సయీద్‌కు వ్యతిరేకంగా నిఘా వర్గాల సమాచారం ఉందని, ఆర్థికమంత్రిత్వశాఖ వద్ద కూడా అతనికి వ్యతిరేకంగా తగినంత ఆధారాలు ఉన్నాయని అధికారులు చెప్పినా.. రివ్యూ బోర్డు ఈ వాదనతో ఏకీభవించలేదు. -
350 భారత జాలర్లకు విముక్తి
-
350 భారత జాలర్లకు విముక్తి
కరాచీ: పాకిస్తాన్ ప్రాదేశిక జాలాల్లో వేట సాగించి అరెస్టైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కేసు విచారణ కోసం మలిర్ జిల్లా జైలుకు చేరుకున్న న్యాయమూర్తి సల్మాన్ అంజాద్ సిద్దిఖీ ముందు నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో 350 మందిని స్వదేశానికి పంపే ఏర్పాటు చేయాలని సిద్దికీ అధికారుల్ని ఆదేశించారు. జనవరి 27 నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్న సమయాన్ని శిక్షాకాలంగా పరిగణించిన ఆయన.. మానవతా దృక్పథంతో జాలర్లను విడుదల చేస్తున్నట్లు తీర్పునిచ్చారు. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వీరిని ఇంతకుముందు అదుపులోకి తీసుకుంది. వీరందరిపై డాక్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేసింది. -
మాజీ ప్రధానిని వెంటనే అరెస్టు చేయండి
కరాచీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనను వెంటనే ఆరెస్టు చేయాల్సిందిగా పాకిస్థాన్‌లోని అవినీతి కేసులను విచారించే కోర్టు ఆదేశించింది. ఆయనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి నమోదైన 12 కేసుకులకు సంబంధించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే గిలానీని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత మఖ్దూమ్ అమిన్ ఫహిమ్‌ను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో గిలానీకి ఇదే కోర్టు ఓ సారి అరెస్టు వారెంట్‌ను ఇచ్చింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ప్రతిసారి కోర్టుకు హాజరుకాకుండా గైర్హాజరు కావడంతో అప్పట్లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.