లాహోర్: 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్‌కు విముక్తి లభించింది. గృహనిర్బంధంలో ఉన్న సయీద్‌ను విడుదల చేయాలని పాకిస్థాన్‌కు చెందిన పంజాబ్ జ్యుడీషియల్ రివ్యూ బోర్డు బుధవారం ఆదేశాలు జారీచేసింది. సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పిస్తే.. అంతర్జాతీయ సమాజం నుంచి మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావొచ్చని పాక్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసిన మరునాడే ఈ మేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం.
సయీద్‌ను గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. అతన్ని పంజాబ్ ప్రభుత్వం మంగళవారం జ్యుడీషియల్ రివ్యూ బోర్డు ముందు హాజరు పరిచింది. అయితే, సయీద్‌కు వ్యతిరేకంగా తగినంత ఆధారాలు సమర్పించడంలో పాక్ సర్కారు విఫలమైందని, కాబట్టి, అతన్ని గృహనిర్బంధంలో కొనసాగించడం రివ్యూ బోర్డు స్పష్టం చేసింది. సయీద్ గృహనిర్బంధం కొనసాగించకుంటే.. అంతర్జాతీయ సమాజం దేశంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని, కాబట్టి అతన్ని గృహనిర్బంధం కొనసాగించాలని పంజాబ్ హోంశాఖ అధికారులు జ్యుడీషియల్ రివ్యూ బోర్డును కోరారు. సయీద్‌కు వ్యతిరేకంగా నిఘా వర్గాల సమాచారం ఉందని, ఆర్థికమంత్రిత్వశాఖ వద్ద కూడా అతనికి వ్యతిరేకంగా తగినంత ఆధారాలు ఉన్నాయని అధికారులు చెప్పినా.. రివ్యూ బోర్డు ఈ వాదనతో ఏకీభవించలేదు.
Comments
Please login to add a commentAdd a comment