మాజీ ప్రధానిని వెంటనే అరెస్టు చేయండి
కరాచీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనను వెంటనే ఆరెస్టు చేయాల్సిందిగా పాకిస్థాన్లోని అవినీతి కేసులను విచారించే కోర్టు ఆదేశించింది. ఆయనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి నమోదైన 12 కేసుకులకు సంబంధించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలోనే గిలానీని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత మఖ్దూమ్ అమిన్ ఫహిమ్ను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో గిలానీకి ఇదే కోర్టు ఓ సారి అరెస్టు వారెంట్ను ఇచ్చింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ప్రతిసారి కోర్టుకు హాజరుకాకుండా గైర్హాజరు కావడంతో అప్పట్లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.