
న్యూఢిల్లీ: ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) ఉపకమిటీ సిఫారసు చేసింది. ఫ్రాన్సు రాజధాని ప్యారిస్‌లో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన ఐసీఆర్‌జీ(ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్)ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల 21వ తేదీన జరిగే ఎఫ్‌ఏటీఎఫ్ అత్యున్నత స్థాయి సమావేశం అంతిమ నిర్ణయం తీసుకోనుంది. 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ న్యాయస్థానం 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పాక్ కోర్టు ఈ నిర్ణయం వెలువరించడాన్ని గ్రే జాబితా నుంచి బయటపడేందుకు పాక్ చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment