Hafiz Syed
-
పాక్ గ్రే లిస్టులోనే..
న్యూఢిల్లీ: ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఉపకమిటీ సిఫారసు చేసింది. ఫ్రాన్సు రాజధాని ప్యారిస్‌లో జరుగుతున్న ఎఫ్ఏటీఎఫ్కు చెందిన ఐసీఆర్జీ(ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్)ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల 21వ తేదీన జరిగే ఎఫ్ఏటీఎఫ్ అత్యున్నత స్థాయి సమావేశం అంతిమ నిర్ణయం తీసుకోనుంది. 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ న్యాయస్థానం 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పాక్ కోర్టు ఈ నిర్ణయం వెలువరించడాన్ని గ్రే జాబితా నుంచి బయటపడేందుకు పాక్ చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. -
దావూద్‌ను పట్టుకునే ధైర్యం కేంద్రానికుందా ?
నిలదీసిన శివసేన ముంబై : అల్‌ఖాయిదా అధినేత లాడ్న్ను మట్టుపెట్టేందుకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్ తరహా చర్యల ద్వారా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉందా అని శివసేన సోమవారం ప్రశ్నించింది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన తన అధికారరిక పత్రిక ‘సామ్నా’ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించింది. కరుడు గట్టిన తీవ్రవాదులు హఫీజ్ సయ్యద్, దావూద్ వంటి వారు పాకిస్తాన్లో రాజకీయ రక్షణతో ప్రశాంతంగా జీవిస్తున్నారంది. పాకిస్తాన్లో దలదాచుకుంటున్న ఉగ్రవాదులకోసం పలుమార్లు అర్థించాల్సిన అవసరం లేదనీ ఒసామా బిన్లాడ్న్ను పట్టుకునేందుకు అమెరికా అనుసరించిన విధానం మన ప్రభుత్వం చేయాలని సూచించింది.