లాహోర్: భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్ అడులుగు వేస్తోంది. పాకిస్తాన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 173 మంది భారతీయులను పాక్ సోమవారం భారత అధికారులకు అప్పగించింది. కరాచి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 172 మంది భారత జాలర్లతోపాటు మరో ఖైదీని పాక్ ఆదివారం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు వారిని అప్పగించారు. అరేబియా సముద్రంలోని తమ జలాల్లోకి ప్రవేశించారని వారిని అరెస్టు చేశారు. శిక్ష ముగిసిన తరువాత వారిని విడుదల చేశారు.
ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారత, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో వీరిని విడుదలచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల్లో ఉన్న ఇరుదేశాల ఖైదీల సమస్యను పాక్ మానవతా దక్పథంతో చూస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.
సంబంధాల పునరుద్ధరణకు పాక్ అడుగులు
Published Mon, Feb 16 2015 9:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement