
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు
హైదరాబాద్ : మాదాపూర్ పత్రికా నగర్లోని ఓ అపార్ట్మెంట్పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. పట్టుబడ్డవారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.