Prostitution homes
-
యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): నిరుపేద యువతులకు డబ్బును ఎరగా చూపుతూ.. గత కొంత కాలంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి మహ్మదీయ కాలనీకి చెందిన షాబానాబేగం(37)ను గత కొంత కాలంగా పేదరికంలో ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
యాదగిరిగుట్టలో వెలుగులోకి వస్తున్న అరాచకాలు
-
యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో భయంకర వాస్తవాలు
-
నేలకింద బందీలు
సాక్షి, యాదాద్రి: ఇరుకు గదులు.. మంచం పట్టేంత జాగా.. ఆ మంచం కింద నేలమాళిగలు.. వాటిలో ఒక్కరిద్దరు మనుషులు పట్టేంత స్థలం..! ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మ్యాన్‌హోల్స్.. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు.. అవి తెరిచి చూస్తే ఓ మనిషి పట్టేంత జాగా..!ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? వ్యభిచార గృహాలపై పోలీసులు రైడింగ్ చేస్తే బాలికలు, యువతులను దాచిపెట్టేందుకు! చిన్నారుల శరీరాలతో సాగిస్తున్న తమ వికృత క్రీడను కప్పిపెట్టేందుకు. ఊపిరి కూడా ఆడని ఆ నేలమాళిగలు, మ్యాన్‌హోల్స్‌లో చిన్నారుల ఆర్తనాదాలను అదిమిపెట్టేందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో వెలుగు చూస్తున్న భయంకర వాస్తవాలివీ. అచ్చు ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా తరహాలో సాగుతున్న ఈ రాకెట్ వెనుక విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పిల్లల శరీర అవయవాలు పెరిగేందుకు ఇంజెక్షన్ల ద్వారా ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇవ్వడం, వ్యభిచారం చేయాల్సిందిగా రాచిరంపాన పెట్టడం, దాడుల సమయంలో దాచేందుకు పక్కాగా నేలమాళిగలు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాలు.. ఇవన్నీ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఈ చీకటి కూపాల నుంచి ఇప్పటికే 11 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు.. గురువారం ఇంకో నలుగురిని రక్షించారు. మరో ఆరుగురు వ్యభిచార గృహాల నిర్వాహకుల అరెస్టు చేశారు. బాలికలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాగే మరికొందరు పిల్లలు వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. రావడం ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యభిచార గృహాల్లో ఈ నేలమాళిగలు వెలుగు చూశాయి. ఎవరైనా అధికారులు, పోలీసులు వస్తున్నారన్న అనుమానం వస్తే చాలు నిర్వాహకులు.. చిన్నారులు, యువతులను అందులోకి పంపించేస్తారు. వారు వెళ్లిపోయాక అందులోంచి బయటికి తెస్తారు. ఎవరూ గుర్తించలేని విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. భూగృహాల్లో ఇద్దరు చిన్నారుల వరకు కూర్చునే వీలుంటుంది. బయటకు రావడం ఆలస్యమైతే ఊపిరి ఆడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఇలాంటి గదులు ముంబై రెడ్‌లైట్ ఏరియాలో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంటి వరండా, ఖాళీ స్థలాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే వెలుగుచూశాయి. మనిషి పట్టేంత గుంతలు తీసి పైన మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు పెడతారు. అలాగే బీరువాలు, కప్‌బోర్డులు, డోర్ల వెనుక పిల్లలను నక్కి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇబ్బడిముబ్బడిగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు పిల్లలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడన్న అనుమానంతో యాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ఆర్ఎంపీ వైద్యుడు నర్సింహను అరెస్ట్ చేశారు. అతడిని విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికల అవయవాల ఎదుగుదల కోసం ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తేలింది. దీంతోపాటు 48 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇతడి వద్ద దొరికాయి. పాడి పశువుల నుంచి అధిక పాలను తీయడానికి ఈ ఇంజెక్షన్‌ను వాడుతారు. ప్రభుత్వం ఈ ఆక్సిటోసిన్‌ను నిషేధించింది. మరిన్ని దాడులకు పోలీసులు సిద్ధం యాదగిరిగుట్టతోపాటు రాజధాని శివారులోని మరికొన్ని చోట్ల దాడులు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసుల దాడుల నేపథ్యంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చిన్నారులను శివారు కేంద్రాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్లు ఇవ్వడంలో మరో ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు పిల్లల్ని కొనుగోలు చేసందుకు కొందరు ఫైనాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం ఆరా తీస్తున్నారు. -
వ్యభిచార దందాపై పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాద్: నగరంలో వ్యభిచార దందాను నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందా నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మెజిస్ట్రేట్‌కు ఉందని, మేజర్లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి 75 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన 40 మందికి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఇటువంటి అరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేస్తున్నారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. వీటిలో సరూర్‌నగర్ మండలం అల్కాపురిలోని దుగ్గిరాల అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 103, దిల్సుఖ్నగర్ లలితా నగర్‌లోని శిల్పి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 106, సరూర్‌నగర్ కర్మన్‌ఘాట్‌లోని జ్యోతినగర్ రోడ్డు నంబర్ త్రీలోని రెండో అంతస్తు ప్లాట్ నంబర్ 22ను, కొత్తపేట న్యూ మారుతీనగర్ బాబు కాంప్లెక్స్‌లోని తొలి అంతస్తు 1-6-30ని సరూర్‌నగర్ తహసీల్దార్ సీజ్ చేశారు. అలాగే, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇళ్లలో ఇకపై అటువంటి కార్యకలాపాలు ఆపేయాలని ఆరు అపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు
హైదరాబాద్ : మాదాపూర్ పత్రికా నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. పట్టుబడ్డవారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: మహారాష్ట్ర లోని చంద్రాపూర్ లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ పోలీసులు దాడి చేశారు. అక్కడ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యువతులను రక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 30 మంది మహిళలకు విముక్తి కలిగించారు. బుధవారం తెలంగాణకు చెందిన సీఐడీ బృందం ఈ దాడులు నిర్వహించింది. మహిళలను సాయంత్రం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం 30 మంది యువతులను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.