
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: మహారాష్ట్ర లోని చంద్రాపూర్ లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ పోలీసులు దాడి చేశారు. అక్కడ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యువతులను రక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 30 మంది మహిళలకు విముక్తి కలిగించారు.
బుధవారం తెలంగాణకు చెందిన సీఐడీ బృందం ఈ దాడులు నిర్వహించింది. మహిళలను సాయంత్రం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం 30 మంది యువతులను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.