ramgopal pet
-
కారులో మరో కిరాతకం.. నెక్లెస్‌రోడ్డులో బాలికపై యువకుడి అత్యాచారం
సనత్‌నగర్ (హైదరాబాద్): నగరంలో మరో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. రొమేనియా బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో విచారణ కొనసాగుతుండగా.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈ అఘాయిత్యం కూడా కారులోనే జరగడం గమనార్హం. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) గోల్కొండ సూపర్వైజర్ రమ్య ఈ నెల 4న హుమయూన్‌నగర్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. కన్నేసి..కాటేశాడు: నింబోలి అడ్డకు చెందిన అనాథ బాలిక (17) మల్లేపల్లి విజయ్‌నగర్‌కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ స్థానికంగానే ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌కు సమీపంలోని జిరాక్స్ షాపులో పనిచేసే సురేష్ (23) ఆమెపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. బహుమతులు ఇచ్చి లోబరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పట్నుంచీ తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్తున్నామని హాస్టల్లో చెప్పి ఆ బాలిక, ఆమె స్నేహితురాళ్లు ఇద్దరు బయటకు వచ్చారు. తమ క్లాస్మేట్ రాహుల్ పుట్టిన రోజు వేడుక కోసం నెక్లెస్ రోడ్డుకు వెళ్లారు. ఆ వేడుకకు రావాల్సిందిగా సురే‹Ùను కూడా వారు ఆహా్వనించారు. అర్ధరాత్రి 12 గంటల సమ యంలో అందరూ బర్త్ డే వేడుకల్లో నిమగ్నమై ఉండగా నీతో మాట్లాడాలంటూ ఆ బాలికను పిలిచిన సురేష్ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత మామూలుగా హాస్టల్‌కు వచి్చన బాలిక కొద్దిరోజుల తర్వాత నలతగా ఉండటంతో హాస్టల్ సిబ్బంది ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో సురే‹Ùపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసీడీఎస్ సూపర్వైజర్ హుమయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హుమయూన్‌నగర్ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం రాంగోపాల్‌పేట పరిధిలోకి రావడంతో ఆ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అప్పటికే హుమాయున్‌నగర్ పోలీసులు నిందితుడు సురే‹Ùపై ఐపీసీ 376 (2), సెక్షన్ 3 ఆర్/డబ్ల్యూ 4 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన రాంగోపాల్‌పేట పోలీసులు సోమవారం సురే‹Ùను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు: బీజేపీ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేత రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎనీ్వఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి వారొక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖం డించారు. హైదరాబాద్ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు అడ్డాగా మారిందన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై టీఆర్ఎస్, మజ్లిస్ నాయకుల కుమారుల గ్యాంగ్ రేప్, దాష్టీకాలను మరువకముందే నెక్లెస్ రోడ్డులో మరో మైనర్ బాలికపై అత్యాచారం వెలుగు చూడటం అత్యంత బాధాకరమన్నారు. -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
ఆ పని చేస్తే సత్కారం తప్పదు..
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న ప్రబుద్ధులకు సత్కారం చేయనున్నారు! బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారిలో మార్పు తెచ్చేందుకు 'స్వచ్ఛ భారత్' లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టేషన్ చుట్టుపక్కల ఆరు బయట మూత్ర విసర్జన చేస్తున్నవారి దగ్గరకు వెళ్లి వారికి దండ వేసి సత్కరించి ఒక గులాబి పువ్వు ఇచ్చి మరోసారి ఇలాంటిది చేయవద్దని హితవు పలుకనున్నారు. ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రమైన నగరాల కోసం కృషి చేస్తుంటే ఇలా రోడ్లన్నీ అపరిశుభ్రం చేయడం మంచిది కాదని సూచిస్తారు. ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గురువారం ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ రామస్వామి తెలిపారు. -
‘బ్లాక్’ ముఠా ఆటకట్టు
-
‘బ్లాక్’ ముఠా ఆటకట్టు
120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత గ్యాంగ్‌లోని నలుగురి అరెస్టు రాంగోపాల్‌పేట్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌పోర్స్ పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్‌లోని నలుగురిని అరెస్టు చేసి 120 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ ఫిరోజ్, మున్వర్ (కిషన్‌బాగ్)లు హమాలీ మహ్మద్ ఇమ్రాన్, ఫరీద్ (జహీరాబాద్), మహ్మద్ అబ్దుల్ అల్మాస్ (కాలాపత్తర్)లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వీరు మంగళ్‌హాట్ జెన్సీచౌరాకు చెందిన రేషన్ డీలర్ ఓంప్రకాశ్‌తో పాటు నగరంలోని పలువురు రేషన్ డీలర్ల నుంచి కిలో రూపాయి బియ్యాన్ని రూ.14 చొప్పున కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. డీలర్ ఓంప్రకాశ్ ప్రభుత్వం నుంచి తనకు వచ్చే కోటా బియ్యంలో సగం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసి.. మిగతా ‘సరుకు’ను మున్వర్, ఫిరోజ్‌లకు విక్రయిస్తున్నాడు. అలాగే కొందరు కార్డుదారులు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కి కిరాణాషాపుల్లో విక్రయిస్తున్నారు. వీటిని కూడా మున్వర్, ఫిరోజ్ ధ్వయం కిరాణా యజమానుల నుంచి కొనుగోలు చేస్తోంది. వివిధ మార్గాల్లో సేకరించిన బియ్యాన్ని జహీరాబాద్‌లో ఉన్న గోడౌన్‌కు తరలిస్తారు. ఆ గోడౌన్ ఇన్చార్జిగా మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ఇతనికి స్థానికుడు ఫరీద్ సహకరిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలకు విక్రయం:ఇలా పెద్ద మొత్తంలో బియ్యాన్ని సేకరించి ఏడాది పాటు భద్రపరుస్తారు. బియ్యానికి రేటు రాగానే రైస్ మిల్లులకు తరలించి వాటిని పాలిష్ పట్టి సన్న బియ్యంగా మారుస్తారు. ఈ బియ్యాన్ని అధిక ధరకు కర్ణాటక, జహీరాబాద్, బోధన్ తదితర ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కిషన్‌బాగ్‌లోని ఓ గోడౌన్లో రేషన్ బియ్యం అక్రమంగా దాచి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ఉంచారన్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సివిల్ సప్లై అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా భద్రపరిచిన 250 బ్యాగుల్లోని 120 క్వింటాళ్ల బియ్యాన్ని, గోధుమలు, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని నలుగురిని అరెస్టు చేయగా మున్వర్, ఫరీద్ తప్పించుకున్నారు. ఈ ముఠా కొన్నేళ్లుగా ఈ బ్లాక్ మార్కెట్ దందా చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు జలంధర్‌రెడ్డి, మల్లికార్జున్, వెంకటేశ్వరగౌడ్ పాల్గొన్నారు. -
బిస్కెట్లు కొనిస్తానంటూ పసివాడి కిడ్నాప్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : 14 నెలల చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కండోజీ బజార్‌కు చెందిన ఉల్లోజు వీరాచారి, నవ్య దంపతుల ఇంటికి మంగళవారం ఉదయం బంధువైన బాలాచారి (32) వచ్చాడు. వీరాచారి కుమారుడు పృథ్వీ ఆడుకుంటుండగా.. బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు మహంకాళి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. -
బీ.ఈడీ విద్యార్థిని అదృశ్యం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గాస్మండి ప్రాంతానికి చెందిన ఎల్కపల్లి దేవయ్య కుమార్తె స్రవంతి (21)ఆర్జీఆర్ సిద్దాంతి కళాశాలలో బీఈడీ చదువుతోంది. కాగా ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం తనకు బీఈడీ పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది. అయితే సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు.. బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికారు. అయినా లాభం లేకపోవడంతో బుధవారం సాయంత్రం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 040-27853598, 9490598916 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. -
రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్
రాంగోపాల్‌పేట (హైదరాబాద్) : అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని గురువారం రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొని తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి సరైన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.