రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న ప్రబుద్ధులకు సత్కారం చేయనున్నారు! బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారిలో మార్పు తెచ్చేందుకు 'స్వచ్ఛ భారత్' లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టేషన్ చుట్టుపక్కల ఆరు బయట మూత్ర విసర్జన చేస్తున్నవారి దగ్గరకు వెళ్లి వారికి దండ వేసి సత్కరించి ఒక గులాబి పువ్వు ఇచ్చి మరోసారి ఇలాంటిది చేయవద్దని హితవు పలుకనున్నారు.
ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రమైన నగరాల కోసం కృషి చేస్తుంటే ఇలా రోడ్లన్నీ అపరిశుభ్రం చేయడం మంచిది కాదని సూచిస్తారు. ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గురువారం ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ రామస్వామి తెలిపారు.
ఆ పని చేస్తే సత్కారం తప్పదు..
Published Thu, Feb 18 2016 9:35 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement