ప్రిజం పబ్‌లో దారుణం.. కస్టమర్‌పై బౌన్సర్ల దాడి | Bouncers Attack On Customers In Prism Pub At Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రిజం పబ్‌లో దారుణం.. కస్టమర్‌పై బౌన్సర్ల దాడి

Published Sun, Apr 24 2022 6:17 PM | Last Updated on Sun, Apr 24 2022 6:41 PM

Bouncers Attack On Customers In Prism Pub At Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రిజం పబ్‌లో దారుణం చోటుచేసుకుంది. శినివారం రాత్రి నందకిషోర్‌ అనే కస్టమర్‌పై బౌన్సర్లు ఒక్కసారిగా దాడికి దిగారు. నంద కిశోర్‌ను ముగ్గురు బౌన్సర్లతో పాటు యజమాని చితకబాదారు. బౌన్సర్ల దాడిలో నంద కిశోర్‌ గాయపడ్డారు. బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. పోలీసుల ముగ్గురు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.

నంద కిశోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. నో స్మోకింగ్ జోన్‌లో స్మోక్ చేశానని, తనకు అసలు అది నో స్మోకింగ్ జోన్ అని తెలిదయని తెలిపారు. మొట్ట మొదటిసారిగా తాను పబ్‌కి వెళ్లానని చెప్పారు. బౌన్సర్స్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని అన్నాడు. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తన ఫ్రెండ్స్ వచ్చి ఆపినా.. కాళ్లు పట్టుకున్నా తనను వదలలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవండి: పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement