bouncers attack
-
హీరోయిన్ తమన్నా బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటీ తమన్నా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. కొందరు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా.. మీడియా ప్రతినిధులతో బౌన్సర్లు వాగ్వావాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్మీట్లో ఈ సంఘటన జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: Tamannaah Bubbly Bouncer: కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..) హీరోయిన తమన్నా టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'. ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. -
నైట్‌క్లబ్ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన..
Nightclub Viral Video.. బౌన్సర్లు ఓ నైట్ క్లబ్ వద్ద హల్చల్ చేశారు. పబ్‌కు వచ్చిన మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఓ మహిళను అసభ్యకరంగా తాకడంతో ఇదేంటని అడిగిన పాపానికి బాధితులను బౌన్సర్లు చితకబాదారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని ఓ నైట్ క్లబ్‌కు కొంత మంది ఐటీ ఉద్యోగులు వెళ్లారు. వారిలో కొందరు మహిళ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, వారు క్లబ్‌లోని ప్రవేశిస్తున్న క్రమంలో ఓ బౌన్సర్ యువతితో అనుచితంగా ప్రవర్తించి.. తాకరాని చోట చేతి తగిలించాడు. ఈ విషయం ఆమె.. తన సహచరులకు చెప్పడంతో వారు.. బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. Gurugram -: Bouncers brutally beat up girl and her manager friend for resisting molestation, case registered pic.twitter.com/8ri6FTwiFM — UP Model/பெண்கள் பாதுகாப்பு உபி மாடல் (@UPModel2022) August 10, 2022 ఈ క్రమంలో బౌన్సర్లు వారిపై దాడి దిగారు. మహిళలు అని కూడా చూడకుండా ఉద్యోగులందర్నీ చితకబాదారు. వారి దాడిలో కొంత మందికి రక్తం కారడంతో ఆపండి అని మహిళలు ఎంతో అరుస్తున్నా బౌన్సర్లు మాత్రం పట్టించుకోలేదు. బౌన్సర్ల దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. దాడి చేస్తున్న సమయంలో బౌన్సర్లు ఓ వ్యక్తి చేతి ఉన్న వాచ్, రూ. 10వేలను తీసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Visuals from #Gurugram :Bouncers Assaulted Guests Outside Pub pic.twitter.com/C3mOEstwXh — Sonu Kanojia (@NNsonukanojia) August 10, 2022 ఇది కూడా చదవండి: గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి.. -
ప్రిజం పబ్‌లో దారుణం.. కస్టమర్‌పై బౌన్సర్ల దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రిజం పబ్‌లో దారుణం చోటుచేసుకుంది. శినివారం రాత్రి నందకిషోర్ అనే కస్టమర్‌పై బౌన్సర్లు ఒక్కసారిగా దాడికి దిగారు. నంద కిశోర్‌ను ముగ్గురు బౌన్సర్లతో పాటు యజమాని చితకబాదారు. బౌన్సర్ల దాడిలో నంద కిశోర్ గాయపడ్డారు. బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. పోలీసుల ముగ్గురు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. నంద కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. నో స్మోకింగ్ జోన్లో స్మోక్ చేశానని, తనకు అసలు అది నో స్మోకింగ్ జోన్ అని తెలిదయని తెలిపారు. మొట్ట మొదటిసారిగా తాను పబ్‌కి వెళ్లానని చెప్పారు. బౌన్సర్స్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని అన్నాడు. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తన ఫ్రెండ్స్ వచ్చి ఆపినా.. కాళ్లు పట్టుకున్నా తనను వదలలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి! -
పవర్ స్టార్ నిద్రపోకుండా పవర్ కట్..
కాశీబుగ్గ : పలాసలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన ప్రాంతంలో ఇద్దరు యువకులు ప్రహరీ లోపలికి చొరబడిన సంఘటన వివాదాస్పదమైంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న కొంతమంది విద్యుత్ ఉద్యోగులు పవన్‌కల్యాణ్‌కు కలవడానికి వచ్చామని, లోపలకు విడిచిపెట్టాలని గేటును కాలుతో తన్నారు. ఈ సమయంలో పవన్ నిద్రలో ఉన్నారని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహించిన యువకులు ఎలా పడుకుంటారో చూద్దామంటూ పరిసర ప్రాంతంలో విద్యుత్ లైన్లు కత్తిరించారు. దీంతో సరఫరాకు అంతరాయం కలిగి..చీకటిగా మారింది. ఇద్దరు యువకులు పవన్ సిబ్బిందిపై దాడికి కూడా ప్రయత్నించారు. అందులో ఒకరిని పట్టుకోగా అతనిపేరు మోహన్‌గా గుర్తించారు. వారిని బౌన్సర్లు బంధించి పోలీసులకు అప్పగించారు. దీంతో విషయం తెలుసుకున్న మరికొంతమంది విద్యుత్ ఉద్యోగులు చేరుకొని ధర్నా చేశారు. దీంతో లైన్‌మన్ రాజారావుతో పాటు పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి సీఐ కె.అశోక్‌కుమార్, కాశీబుగ్గ ఏఈ ప్రదీప్ చేరుకొని కావాలనే విద్యుత్‌ను తీసినట్టు గుర్తించారు. తగాదాలో పవన్ బౌన్సలర్కు తీవ్రగాయాలయ్యాయి. -
బిల్లు తేడా ఉందంటే.. పబ్‌లో చితకబాదారు
బిల్లులో తేడా ఉందని చెప్పినందుకు ఎన్నారై యువకుడిని, అతడి స్నేహితులు ఇద్దరిని పబ్‌లో బౌన్సర్లు చితకబాదారు. ఈ ఘటన గుర్గావ్లో చోటుచేసుకుంది. వాళ్లలో ఇద్దరికి గాయాలయ్యాయి. యూకేలో నివాసం ఉండే రాహుల్ లక్ష్మణ్, తన స్నేహితులు ఇషాంత్ అగర్వాల్, సిద్దార్థ్‌లతో కలిసి గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో ఉన్న ద వైన్ కంపెనీ అనే పబ్‌కు ఓ మహిళతో కలిసి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత ఆమె వెళ్లిపోయింది గానీ వాళ్లు ముగ్గురూ అక్కడే ఉన్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో యువకులకు, పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. దీనిపై ఇద్దరూ వేర్వేరుగా చెబుతున్నారు. పబ్ మూసే సమయం అయిపోయింది కాబట్టి ఇక డ్రింకులు ఇవ్వబోమని చెప్పినందుకు వాళ్లు గొడవ పడ్డారని పబ్ యాజమాన్యం చెబుతుండగా, బిల్లులో తేడా ఉందని చెప్పినందుకు వాళ్లు తమపై దాడి చేశారని యువకులు అంటున్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎక్కువై, చివరకు బౌన్సర్లను పిలిచారు. తాము బార్ మేనేజర్‌తో బిల్లు గురించి మాట్లాడుతుండానే బౌన్సర్లు వచ్చి తమమీద దాడి చేశారని రాహుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బేస్‌బాల్ బ్యాట్లతో కూడా కొట్టారని, దాంతో తన పన్ను విరిగిందని, ఇషాంత్‌కు మెడమీద గాయం అయ్యిందని తెలిపాడు. నలుగురైదుగురు బౌన్సర్లతో సమా 12 మంది సిబ్బంది వచ్చి తమపై దాడి చేశారని, తన స్నేహితుడి తలమీద ఓ బాటిల్‌తో కొట్టారని రాహుల్ లక్ష్మణ్ చెప్పాడు. ముగ్గురినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన తర్వాత ఇంటికి పంపేశారు. దీనిపై తాము విచారణ జరుపుతున్నామని, పబ్‌లోని సీసీటీవీ ఫుటేజి తెప్పించుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అది రాగానే పూర్తిగా పరిశీలించి చట్టప్రకారం ఎవరి తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
మీడియాపై బౌన్సర్ల దాడి.. పవన్ క్షమాపణలు
హైదరాబాద్: పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్ర సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా పవన్‌కళ్యాణ్‌కు మంత్రులు శనివారం ఆహ్వానపత్రిక అందజేశారు. నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్‌ను మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిత్రయూనిట్ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. దీంతో పవన్ బౌన్సర్ల దాడిని ఖండిస్తూ వీడియో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. బౌన్సర్లు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. క్షమాపణలు చెబుతున్నా: పవన్ సాధారణంగా మీడియాకు ఇబ్బంది కలిగే పరిస్థితిని తాను కల్పించనని, అయితే అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి మంత్రులు వచ్చిన సందర్భంగా మీడియా సిబ్బందిపై జరిగిన దాడికి క్షమాపణలు చెబుతున్నానని సినీహీరో పవన్ కల్యాణ్ చెప్పారు. సాధారణంగా ఎవరో ఒకరు తమ షూటింగు ప్రాంతంలోకి వచ్చేస్తుంటారని, కొంతమంది కెమెరాలతో కూడా వస్తుంటే వాళ్లను తమ సిబ్బంది అడ్డుకుంటారని, వచ్చింది మీడియా అని తెలియకపోవడంతో ఇలా చేసి ఉంటారని పవన్ అన్నారు. దెబ్బలు తగిలిన వాళ్లకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానన్నారు. దాడి చేసిన వాళ్లు ఎవరో గుర్తించి వారికి సరైన పనిష్మెంట్ కూడా ఇస్తానని తెలిపారు.