బిల్లు తేడా ఉందంటే.. పబ్‌లో చితకబాదారు | NRI, friends beaten at gurgaon pub by bouncers | Sakshi
Sakshi News home page

బిల్లు తేడా ఉందంటే.. పబ్‌లో చితకబాదారు

Published Sat, Apr 1 2017 8:12 AM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM

బిల్లు తేడా ఉందంటే.. పబ్‌లో చితకబాదారు - Sakshi

బిల్లు తేడా ఉందంటే.. పబ్‌లో చితకబాదారు

బిల్లులో తేడా ఉందని చెప్పినందుకు ఎన్నారై యువకుడిని, అతడి స్నేహితులు ఇద్దరిని పబ్‌లో బౌన్సర్లు చితకబాదారు. ఈ ఘటన గుర్‌గావ్‌లో చోటుచేసుకుంది. వాళ్లలో ఇద్దరికి గాయాలయ్యాయి. యూకేలో నివాసం ఉండే రాహుల్ లక్ష్మణ్, తన స్నేహితులు ఇషాంత్ అగర్వాల్, సిద్దార్థ్‌లతో కలిసి గుర్‌గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో ఉన్న ద వైన్ కంపెనీ అనే పబ్‌కు ఓ మహిళతో కలిసి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత ఆమె వెళ్లిపోయింది గానీ వాళ్లు ముగ్గురూ అక్కడే ఉన్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో యువకులకు, పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. దీనిపై ఇద్దరూ వేర్వేరుగా చెబుతున్నారు. పబ్ మూసే సమయం అయిపోయింది కాబట్టి ఇక డ్రింకులు ఇవ్వబోమని చెప్పినందుకు వాళ్లు గొడవ పడ్డారని పబ్ యాజమాన్యం చెబుతుండగా, బిల్లులో తేడా ఉందని చెప్పినందుకు వాళ్లు తమపై దాడి చేశారని యువకులు అంటున్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎక్కువై, చివరకు బౌన్సర్లను పిలిచారు.

తాము బార్ మేనేజర్‌తో బిల్లు గురించి మాట్లాడుతుండానే బౌన్సర్లు వచ్చి తమమీద దాడి చేశారని రాహుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బేస్‌బాల్ బ్యాట్లతో కూడా కొట్టారని, దాంతో తన పన్ను విరిగిందని, ఇషాంత్‌కు మెడమీద గాయం అయ్యిందని తెలిపాడు. నలుగురైదుగురు బౌన్సర్లతో సమా 12 మంది సిబ్బంది వచ్చి తమపై దాడి చేశారని, తన స్నేహితుడి తలమీద ఓ బాటిల్‌తో కొట్టారని రాహుల్ లక్ష్మణ్ చెప్పాడు. ముగ్గురినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన తర్వాత ఇంటికి పంపేశారు. దీనిపై తాము విచారణ జరుపుతున్నామని, పబ్‌లోని సీసీటీవీ ఫుటేజి తెప్పించుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అది రాగానే పూర్తిగా పరిశీలించి చట్టప్రకారం ఎవరి తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement