సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని హోంమంత్రి మనవడు ఫుర్ఖాన్ అహ్మద్ స్పష్టం చేశారు. తనెవరికీ పార్టీ ఇవ్వలేదన్నారు. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఘటన జరిగిన రోజు తాను ముంబైలో ఉన్నట్లు తెలిపారు. ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. సీసీ ఫుటేజ్ తీస్తే ఎవరున్నారో తెలుస్తుందన్నారు. తనకు అసలు బెంజ్ కారు లేదని తెలిపారు.
కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment