అ‍త్యంత పురాతన 'పబ్‌'..సందర్శకులు మాత్రం దాన్ని.. | Ye Olde Trip To Jerusalem Historic Pub In England | Sakshi
Sakshi News home page

అ‍త్యంత పురాతన 'పబ్‌'..సందర్శకులు మాత్రం దాన్ని..

Published Sun, Aug 13 2023 9:22 AM | Last Updated on Sun, Aug 13 2023 9:22 AM

Ye Olde Trip To Jerusalem Historic Pub In England - Sakshi

ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మధుశాల. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఎనిమిది శతాబ్దాల కాలానికి పైగా ఇది పనిచేస్తోంది. ‘ది ఓల్డె ట్రిప్‌ టు జెరూసలేం’ పేరుతో ఉన్న ఈ పబ్‌ 1189 సంవత్సరంలో ప్రారంభమైంది. జెరూసలేంపై క్రూసేడ్‌ కోసం బయలుదేరడానికి ముందు అప్పటి ఇంగ్లండ్‌ రాజు కింగ్‌ రిచర్డ్‌ ది లయన్‌ హార్ట్, ఆయన సహచరులు ఈ పబ్‌లోనే మందు విందులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారట! అప్పట్లో ఒక కొండను తొలిచి, ఈ పబ్‌ భవనాన్ని నిర్మించారు.

ఇందులోని గదులు గుహల్లోనే ఉంటాయి. గుహల్లో కూర్చుని పార్టీ చేసుకోవాలనుకునే పర్యాటకులు ఇప్పటికీ ఇక్కడకు పనిగట్టుకుని మరీ వస్తుంటారు. ఈ పబ్‌లో గుహల్లోని బార్లు మాత్రమే కాకుండా, దీనిలో నేల దిగువన సొరంగం కూడా ఉంది. ఈ పబ్‌ ప్రాంగణంలో చక్కని కోట, లోపలి పురాతన వాతావరణం చూస్తే, మధ్యయుగాల్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. ఇది పబ్‌ మాత్రమే కాదు, మ్యూజియం కూడా అని ఇక్కడకు వచ్చే పలువురు సందర్శకులు వ్యాఖ్యానిస్తుంటారు. 

(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కారు! చూస్తే చిన్నసైజు కొండలా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement