సాక్షి, హైదరాబాద్: బంజరాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులు అభిషేక్, అనిల్, డీజే వంశీధర్‌రావు, కునాల్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నాడు.
చదవండి: డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు
వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, అనిల్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఫుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వినియోగించారన్నారు. పోలీసుల దాడులు చేసిన సమయంలో 148 మంది ఉన్నారని. తెల్లవారుజామున 4 గంటల వరకు పబ్ నడిచిందని తెలిపారు.
‘‘డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీసున్నాం. కొకైన్‌ను డ్రింక్‌లో వేసుకుని తాగినట్లు గుర్తించాం. బార్ కౌంటర్‌లో కూడా డ్రగ్స్ సరఫరా చేశారు. పబ్‌లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ వినియోగించారు. కోడ్ చెప్పిన వాళ్లనే పబ్‌లోకి అనుమతించారు. మేనేజర్ కునాల్ నుంచి పూర్తి వివరాలు రాబట్టాలి. గోవా లింక్‌లు ఇంకా బయటపడలేదని’’ డీసీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment