![New Year celebrations at the High Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/3/hc%20c.jpg.webp?itok=zgiStLdD)
పాల్గొన్న సీజే, న్యాయమూర్తులు
సాక్షి,అమరావతి: రాష్ట్ర హైకోర్టులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 25 కేజీల కేక్‌ను కట్ చేశారు. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైకోర్టు ఉద్యోగుల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్‌ను సీజే ఆవిష్కరించారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు సురేంద్రనాథ్, కార్యదర్శి ఎలీషా, కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రబాబు, సంయుక్త కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు రేష్మ, రాంబాబు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment