నిందితుడిని పట్టుకున్న టాస్‌్కఫోర్స్
13.9 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు
సాక్షి, సిటీబ్యూరో: తనను అప్పు అడిగిన చిన్ననాటి స్నేహితుడిని డ్రగ్ పెడ్లర్‌గా మార్చాడో వ్యక్తి. ముంబైలో ఉండే సప్లయర్స్‌ను కూడా పరిచయం చేశాడు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యం అమ్మి దండిగా సంపాదించ వచ్చని ప్రేరేపించాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ నిందితుడిని పట్టుకుని 13.9 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్ స్వాదీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు.
కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహ్మద్ హనీఫ్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై క్యాబ్ డ్రైవర్‌గా మారి 2016లో బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లాడు. మూడేళ్ల తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన అతను తన స్వస్థలంలోనే ఉంటున్నాడు. నెలకు రూ.16 వేల జీతానికి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న హనీఫ్‌కు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొంత మొత్తం అప్పు కావాలంటూ తన చిన్ననాటి స్నేహితుడు చాంద్ పీర్‌ను కోరాడు. ఆరి్థకంగా బలపడాలంటే డ్రగ్స్ దందా చేయాలని, ముంబై నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ ఖరీదు చేసి తీసుకువచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మితే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్‌కు మంచి డిమాండ్ ఉంటుందనీ సలహా ఇచ్చాడు.
అందుకు హనీఫ్ అంగీకరించడంతో ముంబైకి చెందిన డ్రగ్స్ సప్లయర్స్ విక్కీ, రోహిత్‌లను పరిచయం చేశాడు. దీంతో వారి వద్దకు వెళ్లిన హనీఫ్ 13.9 గ్రాములు ఎండీఎంఏ ఖరీదు చేశాడు. దానిని తీసుకుని నేరుగా నగరానికి వచి్చన అతను కస్టమర్ల కోసం కార్ఖానాలోని దోభీఘాట్ వద్ద వేచి ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో తూర్పు మండల టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్‌రెడ్డి, పి.నాగరాజు తన బృందంతో దాడి చేసి హనీఫ్‌ను పట్టుకుని డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా అధికారులకు అప్పగించి పరారీలో ఉన్న చాంద్ పీర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment