అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు

Published Mon, Dec 23 2024 12:27 AM | Last Updated on Mon, Dec 23 2024 12:27 AM

అర్ధర

అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు

శివాజీనగర: ఇక వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది, పాత ఏడాదికి వీడ్కోలు పలికి నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు వేడుకలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంబరాల నిర్వహణకు బీబీఎంపీ, పోలీస్‌ శాఖ కొత్త నిబంధనలను రూపొందించాయి.

సీసీ కెమెరాలు రెట్టింపు

● సామూహిక వేడుకలకు కేంద్ర బిందువైన బెంగళూరులోని ఎం.జీ.రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డులలో సీసీ టీవీ కెమెరాలను పెంచుతారు. గత ఏడాది 300 సీసీ టీవీ కెమెరాలు ఉంటే, ఇప్పుడు 800 కు పెంచుతారు.

● సంబరాలను అర్ధరాత్రి 1 గంటలోగా ముగించాలి. రాత్రి 10 గంటల తరువాత ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డులో వాహన సంచారం బంద్‌ చేస్తారు. బార్‌, పబ్‌లకు కూడా రాత్రి 1 గంటకు మూసివేయాలి.

● ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు మినహాయించి మిగతా చోట్లలో సంబరాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. లౌడ్‌ స్పీకర్‌ డీజే వాడకం, టపాసులు పేల్చడానికి అనుమతి ఉండాలి. నిబంధనల ప్రకారం బారికేడ్లు, లైటింగ్‌ను అమర్చాలి.

● వేడుకల్లో జనాలకు అనారోగ్యం తలెత్తితే పోలీసులే వైద్యులతో చికిత్స చేయిస్తారు.

● పోలీసులు సూచించిన చోట వాహనాలను పార్క్‌ చేయాలి. మహిళల భద్రత కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసుల ఏర్పాటు.

బెంగళూరు పోలీసుల నిబంధన

No comments yet. Be the first to comment!
Add a comment
అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు 1
1/1

అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement