తొలి చూపులోనే తెలిసిపోయింది! | 5 things Samantha Ruth Prabhu CONFESSED a day | Sakshi
Sakshi News home page

తొలి చూపులోనే తెలిసిపోయింది!

Published Fri, Oct 6 2017 12:42 AM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

5 things Samantha Ruth Prabhu CONFESSED a day - Sakshi

గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంత మంచి భర్త వస్తాడంటారు. ఈరోజు మూడు గంటల నుంచి సమంత గోరింటాకు పెట్టుకోబోతున్నారు. కచ్చితంగా చేతులు ఎర్రగా పండుతాయి. నాగచైతన్య లాంటి మంచి అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకోబోతుంటే చేతులు ఎర్రగా పండవా మరి. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం 3 నుంచి 6 గంటల వరకూ మెహిందీ (గోరింటాకు) కార్యక్రమాన్ని ప్లాన్‌ చేశారని బయటికొచ్చిన మ్యారేజ్‌ ఇన్విటేషన్‌ బయటపెట్టింది. రాత్రి 8.30 గంటలకు విందు. 11 గంటల 52 నిమిషాలకు పెళ్లి ముహూర్తం.

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుంది. శనివారం క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ని ఫాలో అవుతూ ఉంగరాలు మార్చుకుంటారు. ఆ రోజు ఉదయం 12 నుంచి 3 గంటల వరకూ బ్రంచ్‌ ఏర్పాటు చేశారు. అంటే.. బ్రేక్‌ఫాస్ట్‌కీ లంచ్‌కీ మధ్య తీసుకునే ఆహారం అన్నమాట. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకూ క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ వెడ్డింగ్‌ జరుగుతుంది. ఆ తర్వాత డిన్నర్, పార్టీ ఏర్పాటు చేశారు. గోవాలోని బీచ్‌ సమీపంలో ఉన్న ‘డబ్ల్యూ’ హోటల్‌లో వివాహ వేడుకలు జరుగుతాయి. ఆ సంగతలా ఉంచితే... గురువారం సరదాగా ట్విట్టర్‌లో ఫాలోయర్స్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలు...

► లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ నిజమా? అబద్ధమా..?
ఆ విషయం ఆయా సందర్భాల్లో ఎవరికి వాళ్లు తెలుసుకుంటారు.

ప్రజెంట్‌ మీ మైండ్‌లో ఏం ఉంది?
నెర్వస్‌నెస్‌ అండ్‌ ఎగై్జట్‌మెంట్‌

పెళ్లి తర్వాత నటిస్తారా?
నేనెప్పుడూ సినిమాలను వదల్లేదే!

లైఫ్‌లో మీరు పాటించే రూల్‌ ఏంటి?
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.

మీ లైఫ్‌లోకి వచ్చిన స్పెషల్‌ పర్సన్‌ చై (నాగచైతన్య)నే అని
   మీరు ఎలా తెలుసుకున్నారు? తొలి చూపులోనే తెలిసిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement