చైతూ-సామ్ మ్యారేజ్‌.. లేటెస్ట్ అప్‌డేట్ | Naga chaitanya and Samantha marriage may three days celebration | Sakshi
Sakshi News home page

చైతూ-సామ్ మ్యారేజ్‌.. లేటెస్ట్ అప్‌డేట్

Published Fri, Jul 7 2017 11:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

చైతూ-సామ్ మ్యారేజ్‌.. లేటెస్ట్ అప్‌డేట్

చైతూ-సామ్ మ్యారేజ్‌.. లేటెస్ట్ అప్‌డేట్

హైదరాబాద్‌: టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతల వివాహం ఈ అక్టోబర్‌ 6న గోవాలో వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వివాహం కోసం అటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చైతూ, సామ్ పెళ్లికి సంబంధించి ఓ వార్త ప్రచారంలో ఉంది. వీరి పెళ్లి వేడుక ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు.. అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది.

మోస్ట్ లవబుల్ పెయిర్ వివాహానికి టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతిథులు హాజరయ్యే అవకాశాలున్నాయి. గత జనవరిలో నిశ్చితార్థం కొందరు సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం నటనను కొనసాగిస్తానని ప్రకటించిన సమంత.. పెళ్లికి కొన్ని రోజుల ముందే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజుగారి గది– 2, రామ్‌చరణ్‌కు జోడీగా మరో చిత్రంలో ఆమె నటిస్తున్నారు. తమకు ఎంతో కలిసొచ్చిన న్యూయార్క్‌ని హనీమూన్‌ ప్లేస్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారు ఈ కాబోయే దంపతులు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఏ మాయ చేశావె’కి సంబంధించిన కీలక సన్నివేశాలు అక్కడే చిత్రీకరించారు. అందుకే హనీమూన్‌ని అక్కడ ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement