భావోద్వేగానికి గురైన సమంత | Samantha Posts picture in Instagram Goes Viral | Sakshi
Sakshi News home page

భావోద్వేగానికి గురైన సమంత

Published Sat, Oct 7 2017 9:07 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

Samantha Posts picture in Instagram Goes Viral - Sakshi

సాక్షి, ప్రత్యేకం ‌: పెళ్లి తర్వాత పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్లడం ప్రతి అమ్మాయి జీవితంలో జరగుతుంది. సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందకు సంతోషంగా ఉన్నా.. కన్నవారిని విడిచి వెళ్లడం మనసును మెలిపెడుతూ ఉంటుంది. ఇదే భావోద్వేగానికి సమంత కూడా గురయ్యారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భావోద్వేగంతో కంట తడి పెడుతున్న ఫొటోను ఆమె పోస్టు చేశారు.
 

‘ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. నిన్న తీసిన షాట్‌ ఇది. అలెన్జ్‌ ఈ భావోద్వేగాన్ని చిత్రీకరించారు. పోజు ఇచ్చి దిగే ఫొటోల కన్నా.. రియల్‌ మూమెంట్స్‌లో తీసే ఫొటోలు ఎప్పుడూ అపురూపంగా ఉంటాయి. పెళ్లికూతురు సమంత భావోద్వేగానికి గురైనప్పుడు.. చాలా చాలా సంతోషం మధ్యలో ఆనంద బాష్పాలు’ అని ఆమె తన పోస్టులో రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement