సాక్షి, ప్రత్యేకం : అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం రెండోసారి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శనివారం ఘనంగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్వీటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చైతన్య, సమంతలు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నట్లు ఫొటోలలో తెలుస్తోంది. శనివారం సాయంత్రం గోవాలో జరిగిన ఈ పెళ్లిలో సమంత లాంగ్ ఫ్రాక్‌లో, చైతన్య సూట్‌లో చూడచక్కగా కనిపించారు. మరోవైపు నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment