బుగ్గ చుక్క పెట్టి వచ్చే సమంత. తాళి బొట్టు చేతబట్టి... సమంత చేయి పట్ట వచ్చే నాగచైతన్య. పెద్దలు వేసిన అక్షింతలు... దేవుడు పంపిన దీవెనలతో... ఎప్పుడో మనసులు కలసిన వీళ్లిద్దరూ శుక్రవారం రాత్రి 11.52 గంటలకు గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సంతోషాల పందిరిలో... సన్నిహితుల సమక్షంలో... మంగళ వాయిద్యాలతో... హిందూ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య, సమంతల వివాహ వేడుక జరిగింది. ఈ రోజు సాయంత్రం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది.
‘ఏ మాయ చేసావె’తో ఒకరికొకరు పరిచయమైన నాగచైతన్య, సమంతలు... ‘మనం’లోనే ముందస్తుగా ఓసారి పెళ్లి మంత్రాలు చదివేశారు. ఆ తర్వాత ‘ఆటోనగర్...’నే తమ ప్రేమ్‌నగర్‌గా మార్చుకుని ఇష్టాలను, కష్టాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. నిన్న రాత్రి ఇంకోసారి చదివారు. ‘మనం’లో సినిమా కోసం చదివితే... ఇప్పుడు సరికొత్త జీవితం కోసం చదివారు.
శుక్రవారం పెళ్లికి కొన్ని గంటల ముందు నాగచైతన్య తండ్రి, హీరో అక్కినేని నాగార్జున తమ ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేశారు. చైతూ ఒళ్లో కూర్చుని దిగిన ఫొటోను సమంత షేర్ చేశారు. ఇంకా పెళ్లికి హాజరైన ప్రముఖులు వేడుకలోని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చైతూ–సమంత పెళ్లి వేడుకలో విశేషాలను మీరూ (పాఠకులు) చూడండోయ్! వేద మంత్రాలతో ఒక్కటైన ఈ జంటను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించమని దీవించేద్దాం!!
చైతూ, సమంత పెళ్లి ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment