చైతూ, సమంతల పెళ్లికి ముహుర్తం కుదిరిందా..?
ప్రస్తుతం టాలీవుడ్లో అక్కినేని వారసుల పెళ్లిల్లపై భారీ చర్చజరుగుతోంది. ఇప్పటికే పెళ్లి విషయంలో క్లారిటీ రాగా సమంత, చైతూల పెళ్లి ఎప్పుడన్నది అర్ధం కావటంలేదు. డిసెంబర్ నెలలో జరగనున్న అఖిల్ నిశ్చితార్ధానికి భారీ ఏర్సాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు అఖిల్ పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో విదేశాల్లో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అదే సమయంలో నాగచైతన్య, సమంత పెళ్లి విషయంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. వీరి వివాహాన్ని 2017 ఆగస్టులో నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో అనుకున్నట్టుగా హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం రెండు వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు. అయితే ఒక్క రోజు తేడాతో ముందు హిందూ వివాహం తరువాతి రోజు క్రిస్టియన్ వివాహం ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పెళ్లి విషయంలో అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.