సాక్షి, చెన్నై : కథానాయకిగా మంచి రైజింగ్‌లో ఉన్న టైమ్‌లోనే పెళ్లికి సిద్ధం అయిన నటి సమంత. ఆమెకు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. తమిళంలో నటించిన తాజా చిత్రం మెర్శల్ దీపావళికి విడుదల కానుంది. మరో రెండు రోజుల్లో టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఏడడగులు వేయడానికి రెడీ అవుతున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక పక్క పెళ్లికి సిద్ధం అయిన సమంత మరో పక్క వృత్తి పైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారట.
వివాహానంతరం నటిస్తానని ఇప్పటికే ప్రకటించిన సమంత ఇటీవల ఒక చిత్రం కోసం ఏర్పాటు చేసిన ఫొటో సెషన్‌లో చాలా గ్లామర్‌గా ఫోజులివ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోలను చూసి ఆమె అభిమానులు కూడా అవాక్కవుతున్నారట. ఈ విషయం సమంత దృష్టికి చేరడంతో ఇకపై గ్లామర్ పాత్రల్లో నటించరాదని ఆమె నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్. అంతేకాదు, తనకు కాబోయే భర్త చైతూకు గ్లామర్ పాత్రల్లో నటించనని సమంత మాట కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment