అవన్నీ రూమర్సే: సమంత | Samantha rubbished rumours on her honeymoon | Sakshi
Sakshi News home page

అవన్నీ అబద్ధాలే: సమంత

Published Thu, Jul 20 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

అవన్నీ రూమర్సే: సమంత

అవన్నీ రూమర్సే: సమంత

త్వరలో వివాహబంధంలోకి అడుగు పెడుతున్న హీరోయిన్‌ సమంత... ఆ తర్వాత కొద్దినెలల పాటు నటనకు దూరంగా ఉండనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అంతేకాకుండా పెళ్లి అయిన మూడో రోజే షూటింగ్‌లో పాల్గొంటానని ఆమె స్పష్టం చేశారు. హీరో నాగ చైతన్య, సమంతల వివాహం అక్టోబర్‌ 6వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని, అలాగే ఈ ప్రేమపక్షులు  మూడు నెలల పాటు షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చి హానీమూన్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై సమంత స్పందిస్తూ....‘అక్టోబరు ఆరున మా పెళ్లి వేడుక గోవాలో జరిగేది నిజం. అయితే మా వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిద్దనే ప్రచారం మాత్రం అవాస్తం. ఓ సాధారణ కుటుంబంలో జరిగే పెళ్లిలా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుంది. అలాగే పెళ్లి నేపథ్యంలో మూడు నెలలు నటనకు దూరం ఉంటామనే వార్తలు నిజం కాదు. ఇక హనీమూన్‌ ప్రణాళికలాంటిదేమీ లేదు. పెళ్లైన మూడో రోజునే ఇద్దరం షూటింగ్‌లో పాల్గొంటాం.’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement