‘మజిలీ’ వైజాగ్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌! | Naga Chaitanya And Samantha Movie Vizag Schedule Completed | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 22 2018 4:53 PM | Last Updated on Thu, Nov 22 2018 5:06 PM

Naga Chaitanya And Samantha Movie Vizag Schedule Completed - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ అండ్‌ బెస్ట్‌ పెయిర్‌ నాగచైతన్య, సమంత కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి చేస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు అభిమానులను అలరించాయి. తాజాగా ఈ జంట ‘మజిలీ’ చిత్రం షూటింగ్‌లో సందడి చేస్తోంది.

ఈ చిత్రయూనిట్ ఇటీవలె వైజాగ్‌లో షూటింగ్‌ జరుపుకుంది‌.ఈ షూటింగ్‌లో పాల్గొన్న సమంత, నాగచైతన్యల ఫోటోలు విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మజిలీ అని టైటిల్‌ ప్రచారంలో ఉంది. కానీ మేకర్స్‌ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వైజాగ్‌ షెడ్యుల్‌ను కంప్లీట్‌ చేసుకున్న చిత్రబృందం.. నవంబర్‌ 26నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

చదవండి : బుకింగ్‌ కౌంటర్‌కి పరిగెత్తిన సమంత, నాగచైతన్య  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement