సమంత కోసం ఎదురుచూస్తున్నాం..! | Naga chaitanya, Samantha marriage Update | Sakshi
Sakshi News home page

సమంత కోసం ఎదురుచూస్తున్నాం..!

Published Fri, Oct 6 2017 10:26 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Chaisam 2 - Sakshi

మరికొద్ది గంటల్లో వేద మంత్రాల సాక్షిగా నాగచైతన్య, సమంతలు ఒక్కటవ్వనున్నారు. ఇప్పటికే అక్కినేని వారింట పెళ్లిసందడి మొదలైంది. ఈ రోజు మద్యాహ్నం నుంచి వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో అక్కినేని, దగ్గుబాటి, సమంతల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకల జరుగనున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగార్జున, సమంతలు పెళ్లిక సంబందించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇప్పటికే గోవాలో చైతూ తో కలిసి షికార్లు చేస్తున్న  ఫొటోలను సమంత ట్విట్టర్ లో పొస్ట్ చేయగా తాజాగా నాగార్జున కూడా ఓ అప్ డేట్ ఇచ్చాడు. ఈ రోజు నాగచైతన్యను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా నాగార్జున, వెంకటేష్ లతో కలిసి నాగచైతన్య దిగిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాగ్, మా అబ్బాయి ఇప్పుడు పెళ్లి కొడుకు అంటూ కామెంట్ చేశారు. తరువాత కాసేపటికే ఈ రోజు సాయంత్రం సమంత మా కుటుంబంలో కలిసే సమయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ అమల, అఖిల్, నాగచైతన్యలతో కలిసి దిగిన మరో ఫొటోను ట్వీట్ చేశాడు.

ఈ రోజు మద్యాహ్నం మెహందీ ఫంక్షన్ తో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాత్రి హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది. రేపు సాయంత్ర క్రిస్టియన్ పద్ధతిలో చర్చ్ లో పెళ్లి జరగనుంది. తరువాత సాయంత్రం కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులకు భారీ పార్టీ ఇస్తోంది అక్కినేని ఫ్యామిలీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement