పెళ్లిమాటే మర్చిపోయారు..! | Naga Chaitanya and Samantha marriage postponed | Sakshi
Sakshi News home page

పెళ్లిమాటే మర్చిపోయారు..!

Published Wed, Apr 19 2017 11:34 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

పెళ్లిమాటే మర్చిపోయారు..! - Sakshi

పెళ్లిమాటే మర్చిపోయారు..!

త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని భావిస్తున్న టాలీవుడ్ పెయిర్ నాగచైతన్య, సమంతలు ఆ మాటే మర్చిపోయారనిపిస్తుంది. చాలా రోజుల కిందటే ఈ జంటకు నిశ్చితార్థం కాగా ఈ వేసవిలో వివాహ వేడుక ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ చైతూ, సమంతలు కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దా సినిమా షూటింగ్ పూర్తి చేసి చైతూ, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. వీటితో పాటు ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఈ రెండు సినిమాలను జూలై నుంచే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.

సమంత కూడా ఇదే స్పీడులో సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే నాగార్జునతో కలిసి రాజుగారి గది 2లో, రామ్ చరణ్ సుకుమార్ సినిమాల్లో నటిస్తున్న సమంత ఈ రెండూ పూర్తవ్వగానే మహానటి షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంది. అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు విశాల్ కొత్త సినిమాకు ఓకె చెప్పే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జంట కమిట్ అయిన సినిమాలు పూర్తవ్వటానికి మరో ఏడాది సమయం పడుతుంది. అంటే ఈ ఏడాది నాగచైతన్య, సమంతల పెళ్లి లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement