చైతూకు, మా ఫ్యామిలీకి సమంతనే పెద్ద గిఫ్ట్ | Nagarjuna gives update on Naga Chaitanya and Samantha wedding | Sakshi
Sakshi News home page

చైతూ, సమంత పెళ్లికి మూడు ఫ్యామిలీలు..

Published Tue, Oct 3 2017 6:20 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Nagarjuna gives update on Naga Chaitanya and Samantha wedding - Sakshi

సాక్షి, హైదరాబాద్ : రాజుగారి గది-2 సినిమాను మలయాళ సినిమా నుంచి తీసుకున్నట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. ఇందులో తనతోపాటు సమంత సీన్స్ చాలా కీలకంగా ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 6న హిందూ, 7న క్రిస్టియన్‌ పద్ధతుల్లో నాగచైతన్య, సమంతల పెళ్లి కాగా.. ఆ తరువాత సినిమా రిలీజ్ అవుతుందని వివరించారు. ఈ సినిమాపై సమంత చాలా టెన్షన్‌గా ఉంది.. హిట్ అవుతుందో లేదోనని తనని అడిగిందన్నారు. తాను మూవీ చూశానని, చాలా బాగా వచ్చిందని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. సమంత మొన్నటి వరకు నాగ్ సార్ అనేది.. ఇప్పుడేమో మామా అంటోందని నవ్వుతూ చెప్పారు.

పెళ్లికి తమ ఫ్యామిలీ, రామానాయుడు గారి ఫామిలీ, సమంత ఫామిలీ మాత్రమే హాజరవుతారని చెప్పారు. నెలాఖరున హైదరాబాద్‌లో నిర్వహించనున్న రిసెప్షన్ కి అభిమానులతో పాటు అందరికీ ఆహ్వానం ఉంటుందన్నారు. సమంత తమ కుటుంబంలో బాగా కలిసిపోయిందన్నారు. నాగ చైతన్యకు, తమ ఫ్యామిలీకి సమంతనే పెద్ద గిఫ్ట్ అని అన్నారు. అన్నిటికంటే షాక్ ఏమిటంటే రాంగోపాల్ వర్మ ఒక కధ చెప్పాడని, అది శివ కంటే బాగుందని.. అందుకే మళ్లీ ఒక నెల తర్వాత వచ్చి కథ చెప్పు.. అప్పుడుకూడా అలానే ఉంటే తప్పకుండా చేయడానికి సిద్ధమన్నారు. డిసెంబర్ 25న అఖిల్ సినిమా రిలీజ్ ఉంటుందని వెల్లడించారు.

మరోవైపు తన పెళ్లిలో చైతూ అమ్మమ్మ (డా.డి.రామానాయుడు సతీమణి డి. రాజేశ్వరి) చీరను సమంత కట్టుకుంటారని సమాచారం. ముంబై డిజైనర్‌ క్రేషా బజాజ్‌ను పెళ్లి దుస్తులు డిజైన్‌ చేయడానికి నియమించుకున్నారని ఇండస్ట్రీలో టాక్‌. రామానాయుడు సతీమణి రాజేశ్వరి చీరను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్‌ చేయిస్తున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement