మానసిక వ్యాధిగ్రస్తులకు నచ్చదు | People with mental illness will not love it, says Simbu | Sakshi
Sakshi News home page

మానసిక వ్యాధిగ్రస్తులకు నచ్చదు

Published Sun, Feb 8 2015 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

మానసిక వ్యాధిగ్రస్తులకు నచ్చదు

మానసిక వ్యాధిగ్రస్తులకు నచ్చదు

 ఎవరేమనుకున్నా గానీ, నటుడు శింబు అనాలనుకుంది అనేస్తారు. చేయాలనుకుంది చేసేస్తాడు. ప్రస్తుతం ఈయన నటించిన మూడు చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటి గురించి శింబు చింతించరు. ఇద్దరు హీరోయిన్లతో లవ్ బ్రేక్ అప్ అయినా మరోసారి వర్కౌట్ అవుతుందిలే అనే ధీమాను వ్యక్తం చేస్తారు. అలాంటి నటుడి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యూయి. శింబు అజిత్‌కు వీరాభిమాని. తన అభిమాన నటుడి చిత్రం ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ చిత్రాన్ని శింబు సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి చూశారు.
 
 అరుుతే చాలా కాలం తరువాత ఒక మంచి తమిళ చిత్రం చూశాను. అజిత్ అద్భుతంగా నటించారు. తల (అజిత్ ) అభిమానులకు పసందైన విందుగా ఉంటుంది. మానసిక బాధితులకు మినహా ఎన్నై అరిందాల్ తమిళ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ చిత్రం నచ్చని వారినందరినీ శింబు మానసిక వ్యాధిగ్రస్తులతో ఎలా పోల్చుతారని పలువురు ఆయనపై ట్విట్టర్‌లో దాడి చేస్తున్నారు. అయితే శింబు మాత్రం చిత్రం చూసి నా అభిప్రాయాన్ని చెప్పాను. ఆ భావ స్వేచ్ఛ నాకుంది. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement